అక్టోబర్ 16నే బ్రూస్‌లీ రిలీజ్

Screen Shot 2015-09-06 at 11.38.50 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ‘బ్రూస్ లీ’, ది ఫైటర్ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ కి ఉన్నతమైన కుటుంబ విలువలను కూడా జత చేసి చేస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. రామ్ చరణ్ సినిమా ప్రారంభం రోజునే సినిమా రిలీజ్ కి ముహూర్తం పెట్టేయడంతో ఆయన ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నాడు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నదియా, రావు రమేష్, కృతి కర్భంద, సంపత్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఆయనపై వచ్చే సీన్స్ ని షూట్ చేయనున్నారు.

ఈ సినిమా అనుకున్న టైంకి రాదనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాత డివివి దానయ్య ఈ వార్తలపై స్పందించడమే కాకుండా ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. ‘బ్రూస్ లీ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికి 85% టాకీ పార్ట్ తో పాటు, 2 పాటల షూటింగ్ కూడా పూర్తయ్యింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫాస్ట్ గా జరుగుతోంది. ఎలాంటి వాయిదా లేకుండా అనుకున్న టైంకే అనగా దసరా కానుకగా అక్టోబర్ 16నే సినిమా రిలీజ్ రిలీజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా వాయిదా పడదని’ డివివి దానయ్య తెలిపాడు.

Filed Under: బ్రూస్‌లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *