అతడు .. జులాయి .. అ ఆ

a A

  1. అతడు సినిమాతో మహేష్‌బాబుకు సరికొత్త ఇమేజ్ క్రియేట్ చేసాడు. ఆ ఇమేజ్‌తో పొకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్డాడు మహేష్‌బాబు.
  2. పవన్‌కల్యాణ్ ఫ్లాపులు మీద ఫ్లాపులతో తమిళ్ డైరక్టర్స్ మీదే ఫుల్‌గా డిపెండ్ అయిపొతున్నాడనుకుంటున్న సమయంలో జల్సాతో, పవన్‌కల్యాణ్ ఫ్లాప్ సినిమాలకు బ్రేక్ వేసాడు.
  3. జులాయి సినిమాతో అల్లు అర్జున్ పెద్ద హిరో రేంజ్‌కు ఏమీ తక్కువ కాదు అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపిస్తే, రేసుగుర్రంతో ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా ఇచ్చాడు అల్లు అర్జున్.
  4. ఇప్పుడు నితిన్ రేంజ్ పెంచే ప్రయత్నంలో “అ.. ఆ” వస్తుంది.

‘అ ఆ’ అంటే ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి. ఆనంద్ విహారి పాత్రలో నితిన్ నటిస్తుండగా…అనసూయ రామలింగం పాత్రలో సమంత నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను నితిన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

  1. త్రివిక్రమ్ మార్క్‌తో చూడగానే ఆకట్టుకునే విధంగా చూడముచ్చటగా ఈ టీజర్‌తో ఉంది.
  2. నితిన్, సమంత ట్రైన్‌లో ప్రయాణిస్తూ..ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు.
  3. అ ఆ’ అనే పక్కపక్కనుండే రెండు అక్షరాల పరిచయానికి పాతికేళ్లు పట్టింది అంటోంది సమంత.

మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్‌లతో పాటు నదియ, అనన్య, ఈస్వరీరావు, సన, గిరిబాబు, నరేష్, రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రలో నటించారు.

Filed Under: అ ఆ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *