బాబాయి కోసం అబ్బాయి త్యాగం

Balayya's Legend first look

జూలై 31న “ఎవడు”
ఆగష్టు 7న “అత్తారింటికి దారేది”

రాష్ట్ర విభజనపై గందరగోళం గొడవలు బంద్‌లు కారణం చేత అలా జరగలేదు.కాని, ఆ టైంలో మెగా బాబాయి & అబ్బాయి లిద్దరూ, సినిమా రిలీజ్ డేట్ సినిమాపై ఎంతో ఖర్చు పెట్టిన నిర్మాతల ఇష్టం అంటూ ఏ ఒక్కరూ తమ సినిమాను వాయిదా వేసుకొవడానికి ఇష్టపడలేదు. వారం రోజులు గ్యాప్‌లో రెండు మెగా సినిమాలు చూడోచ్చు అని నిస్సాహాయులైన ఒక వర్గం మెగా అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే, మన సినిమా కలక్షన్స్ డౌన్‌కు మరో మన సినిమానే కారణం అవుద్దెమోనని రికార్డ్స్ కేర్ చేసే మరో వర్గం మెగా అభిమానులు భయపడ్డారు.

యంగ్ ఎన్.టి.ఆర్ రభస & బాలకృష్ణ లెజెండ్ విషయంలో నందమూరి అభిమానులకు ఆ బాదలు లేవు. బాబాయి కోసం అబ్బాయి చేసిన త్యాగానికి నందమూరి అభిమానులందరూ చాలా హ్యాపీగా వున్నారు.

ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం రభస కోసం భారీగా శ్రమపడుతున్నాడు. ఈ చిత్రాన్ని వేసవి వెన్నెలగా తన అభిమానులకు అందించాలనే ఆలోచనలో ఈ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని తన మొదటి చిత్రం “ఆది” విడుదల తేదీ మార్చి 28న విడుదల చేయాలని నిర్ణయించి తదుపరి తన నిర్ణయం మార్చుకుని కొంచెం ఆలస్యంగా విడుదలకు సిద్దమౌతున్నారు. కారణం అదే సమయంలో బాబాయి లెజెండ్ సినిమా ఉండడంతో, ఇప్పటికే ఆ చిత్రం అదే తేదీన విడుదల చేస్తామని ఆచిత్ర నిర్మాతలు ప్రకటించడంతో ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించి ముందుగా లెజెండ్ చిత్రం విడుదల అయిన తరువాత తన చిత్రం విడుదల చేద్దామని నిర్మాత బెల్లంకొండను కోరగా తాను ఒప్పుకుని విడుదల తేదీని మార్చినట్లు సమాచారం.

Filed Under: Extended FamilyFeatured