అలానే వుంటుంది

Seethamma-Vakitlo-Sirimalle-Chettu

నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, ఒక లైలా కోసం ఫేమ్ పూజా హెగ్డె జంటగా తెరకెక్కిన ముకుంద మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్న ఈ సినిమాని ఈనెల 24వ తేదీన రిలీజ్ చేయాలని యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సినిమా ఎలా వుండబోతుంది? ఎంత కలెక్ట్ చేస్తుందనే ఆసక్తి సినిమా ఇండస్ట్రీ అంతా వుంది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా నచ్చిన వాళ్ళకు కచ్చితంగా ‘ముకుంద’ నచ్చుతుంది, ఎందుకంటే ‘ముకుంద’ సినిమా కూడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లానే వుంటుంది.

1) అద్భుతమైన కథ వుండదు ..
2) సూపర్ హిరోయిజం వుండదు ..
3) రొటీన్ కామెడీ అసలు వుండదు ..
4) పక్కా సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ వుండవు ..
5) మెగా డాన్సస్ వుండవు ..

కాకపొతే నిజజీవితంలో మనకు కనిపించే మనుషులుంటారు. నిజ జీవితంలో మాట్లాడే బాష(వెస్ట్ గొదావరి జిల్లా) వుంటుంది. నిజ జీవితంలో మనం వేసుకునే జోకులు వుంటాయి. హృదయానికి హత్తుకునే డైలాగ్స్ వుంటాయి. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపొయినా సినిమా హంగులు వుంటాయి. మెగా డాన్సస్ లేకపొయినా మంచి క్లాస్ పాటలు వుంటాయి.

ఇక్కడో కిటుకు వుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అందరికీ నచ్చలేదు. నచ్చిన వాళ్ళకంటే నచ్చని వాళ్ళ సంఖ్యే ఎక్కువ. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాపై వచ్చిన విమర్శలు శ్రీకాంత్ అడ్డాలకు ఎంతవరకు చేరాయి, అవి ఓవర్‌కమ్ చెయ్యడానికి ‘ముకుంద’ సినిమాలో ఏమి సరిదిద్దుకున్నాడు అనేది తెలియాలంటే ‘ముకుంద’ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

వరుణ్ తేజ్ మొదటి సినిమా అవ్వడంతో అతనిలో కొంత బెరుకు వుంది. ఆ ప్రెష్‌నెస్‌ను సినిమా కథతో డైరక్టర్ కవర్ చేయగలిగడా అనేది తెలియాలంటే ‘ముకుంద’ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

bottomline:

  1. ‘ముకుంద’ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలానే వుంటుంది.
  2. హిరోయిన్‌ పుజా హెగ్డేకు అంజలి కంటే మంచి పేరు వస్తుంది.
  3. వరుణ్ తేజ్ ప్రెష్‌నెస్(బెరుకు) సినిమాకు ప్లస్ అవ్వాలి.
  4. మాస్ ఎలిమెంట్స్(‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాపై వచ్చిన విమర్శల ఆధారంగా శ్రీకాంత్ అడ్డాల ఈ స్క్రిప్ట్‌లో యాడ్ చేసిన ఎలిమెంట్స్) నెగిటివ్ కాకూడదు.

ఇదే జరిగితే 50 కోట్లు షేర్ ఈజీ.

Filed Under: Mega FamilyFeatured