అల్లు అరవింద్ & దిల్ రాజులపై అనుమానాలు

allu-aravind-and-dil-raju

ఒకసారి బాలకృష్ణ పర బాషా దర్శకులను ఎక్కువగా పొగుడుతూ మన వాళ్లను తక్కువ చేసి మాట్లాడిన ఎవరినో గట్టిగా మందలించాలని ఒక ఫంక్షన్‌లో అన్నాడు. ఆ మాటలు రామ్‌చరణ్‌ను ఉద్దేశించి అన్నట్టుగా అందరూ ఊహించారు. మన మీడియా కూడా దానిని పెద్దగా చేసి చూపించడంతో బాలకృష్ణ స్పెషల్ మీటింగ్ పెట్టి నేను అన్న మాటలు రామ్‌చరణ్‌ను ఉద్దేశించి అన్నవి కాదు అనే దాకా వురుకోలేదు.

అత్తారింటికి దారేది సినిమా సక్సస్ మీట్‌లో పవన్‌కల్యాణ్ సినిమా పైరసీ లీకేజ్ వెనుక సినిమా వాళ్ళే వున్నారని కామెంట్ చేసాడు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ స్పీచ్ కూడా పెను అనుమానాలకు దారి తీసింది.

అత్తారింటికి దారేది సినిమాకు ఎవడు సినిమా పోటి పడటం వలన, చాలామంది అల్లు అరవింద్(sleeping partner of ఎవడు) & దిల్ రాజులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మన మీడియా ఎవరిని టార్గెట్ చేస్తుందో చూడాలి.

లోకం తీరే అంత. బాద్యత కలిగిన/తీసుకోవలసిన వ్యక్తులు, ఇలా క్లూలెస్ గా మీరే ఊహించుకోండి అని జనాల మీద వదిలేయకుండా, ధైర్యంగా ఎవరి వలన అన్యాయం జరిగిందో చెప్పగల్గాలి లేదా మౌనంగా వుండాలి.

Filed Under: Pawan KalyanFeatured