అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ వున్నారా?

AA

audiences are never loyal as “fans”

కేవలం మెగాఫ్యాన్స్ సపోర్ట్ కాకుండా, పవన్‌కల్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ వున్నారు. పవన్‌కల్యాణ్ సినిమాల కంటే, పవన్‌కల్యాణ్ ఆలోచనలు నచ్చిన వాళ్ళు వారు. వాళ్ళు మెగాఫ్యాన్స్ అనికాకుండా, పవన్‌ఫ్యాన్స్ అని చెప్పుకొవడానికే ఇష్టపడతారు. మెగాఫ్యాన్స్‌లో పవన్‌కల్యాణ్‌ను ఇష్టపడని వాళ్ళు చాలా చాలా తక్కువ.

మెగాఫ్యాన్స్ సపోర్ట్ .. చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చారనే పబ్లిక్ పట్టించుకొవడం మినహా .. అల్లు అర్జున్ .. రామ్‌చరణ్ .. వీళ్ళకు నిజంగా ఫ్యాన్స్ వున్నారా?

బాగా యాక్ట్ చేసాడనో, డాన్స్ బాగా చేసాడానో, సినిమా బాగుందనో ఇష్టపడే వాళ్ళు చాలామంది వుండవచ్చు. మెగాఫ్యాన్స్ సపోర్ట్ లేకపొతే, వీళ్ళ రేంజ్ ఎంత?

చిరంజీవి వారసుడిగా రామ్‌చరణ్‌ను మెయ్యవలసిన బాద్యత మెగాఫ్యాన్స్‌పై వుంది. మగధీరతో పాటు రచ్చ, నాయక్ & ఎవడు లాంటి మాస్ హిట్స్ కూడా ఇచ్చి మెగాస్టార్ వారసుడిగా విషయం వుందని నిరూపించుకున్నాడు. కష్టపడతాడు. పరిశ్రమ పెద్దలను గౌరవిస్తాడు. ఫ్యాన్స్‌తో బాగుంటాడు. చిరంజీవి వారసత్వాన్ని నిలబెడతాడు.

అల్లు అర్జున్‌కు ఏమయ్యింది? .. రుద్రమదేవి సరైనోడు సినిమాలతో నన్ను దేవుడిగా ఆరాధించే కొత్త ఫ్యాన్స్ వచ్చేసారు అంటూ, అల్లు అర్జున్‌ను ఇష్టపడే మెగాఫ్యాన్స్‌ను పబ్లిక్‌గా అవమానించడమే కాదు, మీడియాతొ(లేటెస్ట్ ఈనాడు ఇంటర్వ్యూ) కూడా డైరక్ట్‌గా “పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడను” అంటూ తనను ఎంతగానే ఇష్టపడే మెగాఫ్యాన్స్‌ను ఎందుకు దూరం చేసుకుంటున్నాడు? పవన్‌కల్యాణ్ అంటే బేదాభిప్రాయాలు వుండవచ్చు .. ఇలా బయట పడవలసిన అవసరం ఏమిటి? .. అని అనుకుంటున్నారు మెగాఫ్యాన్స్.

తెలివైన తండ్రి వున్నాడు .. ఎవరు కాదన్నారు ? సరైనోడు సినిమా విజయాన్ని ఎంజాయ్ చెయ్యకుండా, అత్యుత్సాహంతో తనను ఇష్టపడే మెగాఫ్యాన్స్‌ను ఎందుకు దూరం చేసుకుంటున్నాడో అల్లు అర్జున్ చెపితే కాని మెగాఫ్యాన్స్ కు తెలియదు.

మెగాఫ్యామిలీ నుంచి ఎంత మంది వచ్చినా, వారికి ఎంత పెద్ద పెద్ద హిట్స్ వచ్చినా .. 1) చిరంజీవి అభిమానులకు, మెగాఫ్యాన్స్‌కు చిరంజీవి వారసుడు “రామ్‌చరణ్”. 2) మెగాఫ్యాన్స్ కు పవన్‌కల్యాణ్‌ అంటే ప్రత్యేక అభిమానం. ఈ రెండు విషయాలు మెగా వారసులందరూ గుర్తుపెట్టుకోవాలి. అంతే కాని, హిట్స్ వచ్చేస్తున్నాయి .. డైరక్టర్స్ తమ వెనకాల పడుతున్నారు .. పవన్‌కల్యాణ్‌ను తగ్గించడానికో, రామ్‌చరణ్‌ను తగ్గించడానికో ప్రేమ నటిస్తూ “నువ్వు పెద్ద పోటుగాడివి” అనే మాయ మాటలకు మోసపొయి, అల్లు అర్జున్ లా బలుపు ప్రదర్శించడం సరికాదు.

bottomline:
మెగాఫ్యాన్స్ సపోర్ట్ నాశనం చేసుకొవడం ముమ్మాటికీ చాలా పెద్ద తప్పు. మెగాఫ్యామిలి నుంచి వచ్చినవాడు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాడని ఎంతగానో ఇష్టపడే మెగాఫ్యాన్స్‌లో, “వీడు కుళ్ళుబోతోడు .. సొంత ఫ్యామిలీకి చెందిన వాళ్ళకే ఎసరు పెడుతున్నాడు .. చాలా కన్నింగ్ ఫెలో” అని ముద్ర పడితే రాజకీయాల్లో చెల్లుతుందెమో కాని, సినిమాల్లో కష్టం. సినిమాలు బాగున్నా చూడటం మానేస్తారు. అల్లు అర్జున్‌పై ఈ విప్లవం ఇప్పటికే మొదలయినట్టుంది. ఉదృతం కాకముందే సరిద్దుకొవడం మంచిది అనుకుంటే, పిల్లతనంతో ఇంకా పెద్దది చేసుకుంటున్నాడు అల్లు అర్జున్.

AA

Filed Under: సరైనోడు

commentscomments

 1. RK says:

  Hari garu,

  well said.

 2. subbu says:

  super brother. Manaki 1.Chiranjeevi 2.Pawan Kalyan 3. RamCharan.

  manam yenduku migilina vaallani andarini moyyali.
  asalu Allu family ni moyalsina avasaram manaki ledu.

  Andaru mega fans alochinchandi, ippatike mana Charan ni chala tagginchaalani try chestunnaru. Pwan ni yevaru yela try chesina yemi cheyyaleru.

  Allu arjun movies ni manam chudatam maaneste atani ki kuda telustundi.

  please do it, idi correct time.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *