అల్లు అర్జున్ ఫేస్ బుక్ నెంబర్ వన్ రికార్డ్

alluarjunfans

అల్లు అర్డున్ టాలీవుడ్ హీరోలెవరికి దక్కని రికార్డు నెలకొల్పాడు. అల్లు అర్జున్ ఫేస్ బుక్ పేజ్ లో 1 మిలియన్ ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. మరే ఇతర హీరోకు ఫేస్ బుక్ పేజ్ లో ఇంతమంది ఫ్యాన్స్ లేరు. కర్నాటక, తమిళనాడు, కేరళలో బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.

బన్నీ తన స్టైలిష్ యాక్టింగ్ తో ఇంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకోగలిగాడు. ముఖ్యంగా డ్యాన్సులు ఇరగదీస్తాడు. టాలీవుడ్ హీరోల్లో అద్భుతంగా డ్యాన్స్ చేసే అతి కొద్దిమంది హీరోల్లో బన్నీ ఒకరు.

అల్లు అర్జున్ ప్రస్తుతం కిక్ ఫేం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేసుగుర్రం అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. రాంచరణ్ ఎవడులో స్పెషల్ రోల్ చేశాడు.

Filed Under: Mega FamilyFeatured