అల్లు అర్జున్ రుద్రమదేవి ఎందుకు చేసాడు?

Rudramadevi

ఎంత ఖర్చు అయ్యిందో తెలియదు కాని టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘రుద్రమదేవి’ ఒకటి అని ప్రచారం జరుగుతుంది. ట్రైలర్ చూసాకా అంచనాలు జీరో కాదు కదా, థియేటర్ దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్ళకూడదన్న రేంజ్‌లో ట్రైలర్ వుంది. మొత్తం సినిమా అంతా గ్రీన్ స్క్రీన్ లో లాగించేసినట్టు వుంది.

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా గుణశేఖర్‌ దర్శకత్వం వహించడంతోపాటు, ఈ చిత్రాన్ని ఆయనే నిర్మిస్తున్నాడు. వీరభద్రుడిగా రాణా, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ ‘రుద్రమదేవి’ చిత్రానికి అదనపు ఆకర్షణలు. కాకతీయ సామ్రాజ్యం బ్యాక్‌డ్రాప్‌లో రుద్రమదేవి జీవిత గాధను సినిమాగా గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న విషయం విదితమే. కాస్త తెలంగాణ స్లాంగ్‌లో గోనగన్నారెడ్డి పాత్రను గుణశేఖర్‌ మలిచాడు. అల్లు అర్జున్ రుద్రమదేవి సినిమాలో ఎందుకు చేసాడోనని జాలి పడుతున్నారు. అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ పాత్రకు తగ్గట్టుగా కాకుండా, పిల్లతనంగా వుందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.

Filed Under: Mega FamilyFeaturedTelugu