అవకాశం:కుట్ర:వైఫల్యం:ఇబ్బందులు

jaihind

పెద్ద విషయాలు మాట్లాడినంత మాత్రాన జ్ఞాని కాదు ! చిన్న విషయాలు కూడా తెలుసుకున్న వాడే జ్ఞాని!పుస్తుక జ్ఞానం తో బాటు లౌకిక జ్ఞానంకూడా అవసరం.
–పరుచూరి గోపాలకృష్ణ

మొన్న పవన్‌కల్యాణ్ స్పీచ్‌కు, పరుచూరి గోపాలకృష్ణ గారి కొటేషన్‌కు బాగా సూట్ అయ్యింది. కేంద్ర పెద్దలు అన్యాయం చెయ్యరు అనే నమ్మకంతో సోద్యం చూస్తున్నట్టు చూస్తూ, అంతా అయిపొయాక, అయిపొయిందని ఏడ్చాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్టం పరిస్థితి, కులాల చిచ్చుతో ఇంకా అధ్వానంగా తయారవుతుంది. పవన్‌కల్యాణ్‌ను చొరవ తీసుకొమని ఎవరూ ఆహ్వానించటం లేదు.(అన్నయ్య చిరంజీవి లాగానే ఆహ్వానం లేనిదే స్పందించడు అనే విమర్శ ప్రజల్లో వుంది). దానికి తోడు కులముద్ర పడుతుందని భయం. బాబును గుడ్డిగా నమ్మి, సర్దార్ గబ్బర్‌సింగ్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో వున్నాడు.

  1. కులాల వారీగా ఓట్ల లెక్కలు వేసుకొని, తప్పుడు హామీలు వాగ్దానాలు చేసి, అవి నెరవేర్చలేక కుల ఉద్యమాలకు అవకాశం కలిపించారు.
  2. ఇదే అదనుగా కులనాయకులను ఒక ప్లాన్ ప్రకారం ముగ్గులోకి దించి కులాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారు.కుట్రదారులు ఇది రాజకీయం అనుకొవడం ఎంత నీచమో ఆ దేవుడికే ఎరుక.
  3. కుట్ర జరుగుతోందని తెలిసి కూడా సరైన జాగ్రత్తలు తీసుకొలేక వైఫల్యం చెందారు.వైఫల్యం మాత్రమే కాదు, రెచ్చగొడుతున్నారు.
  4. జాతి, నిజాయితీ, ధైర్యం, .. తొక్క తోటకూర అంటూ ప్రాణాలు లెక్క చేయని ఒక మొండోడు, పట్టు పట్టాడు.

bottomline:
జన జీవనానికి ఇబ్బందులు. నిస్సాహాయక ప్రజలు అలవాటు పడిపొయారు. ఇంకో పదేళ్ళు వెనక్కి పొతాం. రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యలు సృష్టించి, పెంచే పనిలో వున్నారు.

ఒక కులానికి సంబంధించిన సమస్య కాదు ఇది. పవన్‌కల్యాణ్ అది తెలుసుకొని, జనసేన అధినేతగా కులాల మధ్య చిచ్చు ఆపవలసిన బాద్యత పవన్‌కల్యాణ్‌పై వుంది. జటిలమై సమస్య మరింత బిగియక ముందే ప్రజలను శాంతింప జేయడం అందరికీ మంచింది.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *