‘అ .. ఆ’ పబ్లిసిటీ కూడా లేదు ..

aaa_1

పుణ్యానికి ఎవరూ సినిమాలు తీయరు. చెయ్యరు. రుపాయి పెట్టుబడికి ఎన్ని రుపాయలు వస్తే అంత గొప్ప. పది రుపాయలు ఖర్చు పెట్టి, 3 గంటలు సినిమా కోసం వెచ్చించి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు ఎంత వినోదం ఇస్తే అంత గొప్ప. అందరూ ఒక మంచి సినిమా చెయ్యాలనే లక్ష్యంతోనే ప్రారంభిస్తారు. అనుకోని కారణాలతో ఆ లక్ష్యం చేరుకొలేకపోవచ్చు. 90% ఫెయిల్ అవుతారు. ఇమేజ్ వాడేసుకొని సినిమా తీసేద్దాం అనుకునే రోజులు కావివి. ప్రతిక్షణం కష్టపడాల్సిందే. అందరూ కష్టపడుతున్నారు. సినిమా ఫెయిల్ అయినంత మాత్రానా కష్టపడలేదని కాదు.

మంచి పేరు రావాలంటే సినిమాలో కంటెంట్ వుండాలి. బాగా డబ్బులు రావాలంటే సినిమాకు హైప్ కావాలి. హైప్‌తో పాటు, ఎటువంటి సినిమాను చూడబోతున్నారో ప్రేక్షకులను ప్రిపేర్ చెయ్యాలి. రైట్ ఎక్సపెటేషన్స్ సెట్ చెయ్యడమే పబ్లిసిటీ.

త్రివిక్రమ్ తన సినిమాను హైప్ క్రియేట్ చేసుకొవడంలో వెనుకబడిపొయాడనుకుంటే, పబ్లిసిటీ కూడా చెయ్యడం లేదు.

సర్దార్ ఫ్లాప్ అవ్వడం వలన మెగాఫ్యాన్స్ లో నిరుత్సాహం నెలకొని, సరైనోడు సినిమాపై అంత ఆసక్తి చూపించలేదు. పాటలు హిట్ అవ్వడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మోత్సవం కూడా ఫ్లాప్ అవ్వడంతో క్లాస్ ప్రేక్షకుల్లో ఒక స్థబ్దత నెలకొని వుంది. పెద్ద సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీకి మంచింది. ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఉత్సాహాని క్రియేట్ చేస్తాయి. ఆ రెండు పెద్ద సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఒక రకమైన విరక్తి నెలకొని వుంది.

ఆ విరక్తిని చెరిపేసి, జనాల్లో ఉత్సాహం నింపే సినిమా “అ .. ఆ” కావాలి. జులాయితో అల్లు అర్జున్ పెద్ద రేంజ్ హిరో అయినట్టు, ఈ సినిమాతో నితిన్ కూడా పెద్ద రేంజ్ హిరో అయిపొతే సూపర్.

bottomline:
పబ్లిసిటీ అంటే సినిమా కంటెంట్ రిలీజ్ చెయ్యడం కాదు. సినిమా చూసి బయటకొచ్చే ప్రేక్షకులు ఒక్కసారి కచ్చితంగా చూడొచ్చు అనే టాక్‌తో బయటకు వచ్చేలా, పక్కా వ్యూహం ప్రకారం ప్రేక్షకులను ప్రిపేర్ చెయ్యాలి. సినిమా బాగుండి, ఆ రేంజ్‌కు తగ్గ కలక్షన్స్ లేకపొతే బాదే.

Filed Under: అ ఆ

commentscomments

 1. subbu says:

  Allu Arjun gurinchi pawan fans lo yenduku babu 10 sarlu.

 2. Hari says:

  subbu, take it easy brother

  అల్లు అర్జున్
  చిరంజీవి
  సంపూర్ణేష్ బాబు
  రాజమౌళి
  బాహుబలి
  పవన్‌కల్యాణ్
  మహేష్‌బాబు
  ప్రభాస్
  and so on are Key words

  ఈ Key Words వాడితే వ్రాసేవాడికి & చదివే వాడికి అదో తుత్తి అని ఒక భ్రమ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *