“అ.. ఆ” రేంజ్ ఎంత?

a aa

దర్శకుడు త్రివిక్రమ్, నితిన్, సమంతల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను & సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ,క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ తీసుకొని పక్కాగా విడుదలకు సిద్ధమైంది. తెలుగు సినీ పరిశ్రమలో ఈ వేసవికి భారీ క్రేజ్ ఉన్న సినిమాలన్నీ విడుదలయ్యాక ఈ సినిమా వస్తుంది. త్రివిక్రమ్ మార్క్ భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించారు. మళయాలంలో ‘ప్రేమమ్’ సినిమాతో సంచలనం సృష్టించిన అనుపమ పరమేశ్వరన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

త్రివిక్రమ్ అభిమానులు పబ్లిసిటి అసలు లేదని బాదపడుతున్న సమయంలో, రేపట్నుంచి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. “త్రివిక్రమ్, నితిన్, సమంత స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారని, తివిక్రమ్ సారథ్యంలో రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలను టివి మీడియాకి అందజేయబోతున్నారని, ఈ ఇంటర్వ్యూలన్నీ పూర్తిస్థాయిలో వినోదభరితంగా ఉండబోతున్నాయని, సాధారణంగా ఉండే ప్రశ్నలకు సమాధానం చెప్పేవిధంగా కాకుండా ఆకట్టుకునేరీతిలో పూర్తిగా వైవిధ్యంగా ఈ ప్రోగ్రామ్ ని రూపొందించారని” వార్తలు వస్తున్నాయి.

“అ.. ఆ” రేంజ్ ఎంత? అని ఎవరూ పెద్దగా లెక్కలు వెయ్యకపొవడం విశేషం. అలా అయితే ఎలా? ..

బాహుబలిని కొట్టే సినిమా రావాలి. ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్‌తోనే సాధ్యం. మగధీర సినిమా రికార్డ్స్‌ను అత్తారింటికి దారేది సినిమాతో బ్రేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. “అ .. ఆ” బాహుబలిని కొట్టాలని, కొడుతుందని కాదు. సినిమా రిలీజ్‌కు ముందు ఒక రకమైన కమర్షియల్ క్రేజ్ రావాలి. అది “అ ..ఆ” సినిమాకు క్రియేట్ చేయలేకపొతున్నారు.

ఆ రోజుల్లో, రిలీజ్‌కు ముందు అసలు సౌండ్ చెయ్యకుండా త్రివిక్రమ్ కథ-కథనం-మాటలు అందించిన “నువ్వే కావాలి” సినిమా, ఎంత కమర్షియల్ సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు “అ.. ఆ” సినిమా ఏమి సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే జూన్ 2 వరకు ఆగాల్సిందే.

bottomline:
నితిన్ రేంజ్ పెంచే సినిమా అయితే చాలు. ఆ రేంజ్‌ను తన ప్లానింగ్‌తో నిలబెట్టుకొవాల్సిన బాద్యత నితిన్‌దే.

Filed Under: అ ఆ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *