ఆంజనేయుడు నీవాడు

Anjaneeydu

మొన్న శ్రీమంతుడు సినిమాలో “రాములోరు వ‌చ్చినాడురో…శివ‌ధ‌న‌స్సు విరిచినాడురో…రామ‌రామ‌రామ‌” అంటూ ఒక బెస్ట్ సాంగ్ వ్రాసిన రామ జోగయ్య శాస్త్రి, ఇప్పుడు సుప్రీమ్ సినిమా కోసం “ఆంజనేయుడు నీవాడు” అంటూ మరో అద్భుతమైన సాంగ్ వ్రాసాడు. too good.

పాట విజువల్స్:

రామ జోగయ్య శాస్త్రి స్పీచ్:

ఫుల్ సాంగ్:

rama rama

లిరిక్స్:
ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు
నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ వుంటాడు

ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు
నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ వుంటాడు

చిరు నమ్మకమిస్తే చాలు .. నీ నమ్మినబంటవుతాడు
తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటిస్తాడు
నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు

ఆంజనేయుడు నీవాడు .. నీలోనే వున్నాడు …
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
ఆంజనేయుడు నీవాడు .. నీతోనే వున్నాడు …
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు

ఎందుకా కంగారు .. వద్దులే బంగారు ..
నిప్పులాంటి ఆశయాన్ని అంటదు ఏ కీడు
మనసులో కన్నీరు .. తలచినా తనవాడు ..
కరిగిపోయే రగిలిపోయే తోడు నీకున్నాడు

సాయమంటే ఆయువిచ్చే వాయుపుత్రుడు వీడు ..
గుండె గుడిలో నిన్ను కాచే కండగల మొనగాడు
మాటిస్తే తప్పని వాడు .. నిన్ను మనవాడనుకున్నాడు
నీ కల నెరవేర్చే కర్తవ్యంగా ముందడుగేసాడు

ఆంజనేయుడు నీవాడు .. నీలోనే వున్నాడు …
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు

సైన్యమూ అతడేరా .. ధైర్యమూ అతడేరా ..
స్వామీ కార్యం మరిచిపోనీ ధర్మమూ తనదేరా

నీ కన్నులు వెలిగే దాకా తన కంటికి లేదే నిదుర ..
జై హనుమా అనుకో నీ చిరునవ్వుకు హమీ తన ప్రేమ

ఆంజనేయుడు నీవాడు .. నీలోనే వున్నాడు …
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
ఆంజనేయుడు నీవాడు .. నీతోనే వున్నాడు …
నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు

Filed Under: Featuredసుప్రీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *