ఆగష్టు 12కి ధ్రువ వస్తున్నాడా?

Share the joy
  •  
  •  
  •  
  •  

RC

సినిమాను పక్కా ప్లానింగ్ చేసుకొని, ఆ ప్లానింగ్ ప్రకారం తీయగల్గితే, సినిమాను క్లోజ్‌గా ఫాలో అవుతూ ఎక్సపెటేషన్స్‌తో వచ్చే ఫ్యాన్స్ కు ఇబ్బంది ఏమీ వుండదు. బ్రూస్‌లీ సాంగ్స్ చాలా ఫాస్ట్‌గా తీసినా అటు మేకింగ్ విషయంలో కాని, అటు స్టెప్స్ విషయంలో కాని, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా సెకండాఫ్ అసలు బాగోలేదు కాని, సినిమాను చుట్టేసినట్టుగా ఎక్కడా ఏమీ అనిపించదు.(సర్దార్ గబ్బర్‌సింగ్ పాటలు అలా కాదు, సెకండాఫ్‌లో వచ్చిన రెండు సాంగ్స్ దారుణాతి దారుణంగా చుట్టిపడేసారు)

రామ్‌చరణ్ ప్రస్తుతం చేస్తున్న తెలుగు చిత్రం ‘తని ఒరువన్’ తమిళ చిత్రంకు రిమేక్. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైంది. టైటిల్ ధ్రువ & ఆఘష్టు 12 న రిలీజ్ అని అఫీషియల్‌గా లీక్ చేసారు. ఆ తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియనివ్వలేదు.

సర్దార్ గబ్బర్‌సింగ్‌కు పవర్ బాబీని ఎలా బలవంతంగా కనెక్ట్ చేయించి సినిమా తీయ్యంచారో, ఈ సినిమాను కూడా దర్శకుడు సురేందర్‌రెడ్డిని కనెక్ట్ చేయించి తీయిస్తున్నట్టు వున్నారు. సామన్య ప్రేక్షకుల మాట దెవుడెరుగు మెగాఫ్యాన్స్‌కు కూడా ఈ సినిమా మీద ఆశలు లేవు.

కాకపొతే, చాలా హోంవర్క్ చేసి పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ స్టార్ట్ చేసారు. అదే ప్లానింగ్‌తో సినిమా పబ్లిసిటీ & హైప్ చెయ్యకపొతే, నార్మల్ సినిమాగా మిగిలిపొయే అవకాశం వుంది. ఆగష్టు 12కి ధ్రువ వస్తున్నాడా? లేదా? .. అసలు ఏమి జరుగుతుందనేది ఫ్యాన్స్‌కు తెలియడం లేదు. మొన్న ఉగాదికి ఫస్ట్‌లుక్ పోస్టరో, ఫస్ట్‌లుక్ టీజరో రిలీజ్ చేసివుంటే బాగుండేదని మెగాఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Filed Under: ధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *