ఆడియో ఫంక్షన్ రివ్యూ

never get a chance

ఆడియో రివ్యూ వేరు. ఆడియో ఫంక్షన్ రివ్యూ వేరు. ఇది ఆడియో ఫంక్షన్ రివ్యూ నాలుగు ముక్కల్లో:

  1. ఈ ఫంక్షన్ అందరికీ నచ్చకపోవచ్చు. పవన్‌కల్యాణ్‌ను అభిమానిస్తు, చిరంజీవిని ఆరాధించే వాళ్ళకు OR చిరంజీవిని ఆరాధిస్తూ, పవన్‌కల్యాణ్‌ను అభిమానించే వాళ్ళకు మాత్రం తమ జీవితాల్లో ఒక మరిచిపొలేని అనుభూతి. పై ఫోటో ఒక్కటి చాలు.
  2. నేను చెప్పినా చెప్పకపొయినా చిరంజీవి ఎప్పుడూ నా గుండెల్లో వుండే వ్యక్తి అని పవన్‌కల్యాణ్ వ్యక్తపరచక తప్పలేదు. మొన్న ఇంటర్వ్యూలో చిరంజీవి పేరు చెప్పలేదన్న కామెంట్స్‌కు క్లారిఫికేషన్ అనుకోవచ్చు.
  3. ఒక్క త్రివిక్రమ్ మినహా ఎవరినీ ఫంక్షన్‌కు ఆహ్వానించినట్టు లేరు. ఫంక్షన్ సింపుల్‌గా వున్నా, అభిమానుల ఉత్సాహంతో గ్రాండ్‌గా అనిపించింది.
  4. కెమెరా ముందు అందరికీ నవ్వుతూ కనిపించే పవన్‌కల్యాణ్ వేరు .. నిజమైన పవన్‌కల్యాణ్ వేరు. పవన్‌కల్యాణ్‌తో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. సినిమా కోసం తను కష్టపడతాడు, తన కోసం పని చేసేవాళ్ళను  కష్టపెడతాడు. అంతే కాదు, ఎవరికైనా అవసరమైనప్పుడు అండగా నిలబడతాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత శరత్ మరార్ తెలియజేయడం హర్ట్ టచింగ్.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *