ఆత్మీయ స్పర్శ :పవన్‌కల్యాణ్‌

17kmm75a

బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న చిన్నారి శ్రీజ (13)ను సినీనటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం పరామర్శించారు. ఖమ్మం కార్తీక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పవన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి ఆస్పత్రిలోని వైద్యులను అడిగి తెలుసుకున్నాడు. పవన్ కల్యాణ్ ను కలవాలని ఉందని శ్రీజ చెప్పడంతో మేక్ ఎ విష్ ఫౌండేషన్ సభ్యులు పవన్ కు సమాచారం అందించి ఆమె కోరిక తీర్చారు. బ్రెయిన్‌ఫీవర్‌తో బాధపడుతున్న శ్రీజ(12) అనే బాలిక చివరి కోరికను తన ఆత్మీయ స్పర్శతో నెరవేర్చారు. సుమారు గంటపాటు ఆస్పత్రి లో గడిపి ఆ చిన్నారి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. ‘శ్రీజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా..’ అని పవన్ భావోద్వేగాల మధ్య ప్రకటించారు.

Filed Under: Pawan Kalyan