ఆపండ్రా!!

chandrababu-and-KCR

బుద్దిన్నోడు మీ మాటలు పట్టించుకోడు. బుద్ది లేనోళ్ళు ఇంకా దరిద్రంగా ఆలోచించే ప్రమాదం వుంది. మీరు మీరు .. కొట్టుకు చావండి. జనాలను రెచ్చగొట్టే వాగుళ్ళు ఆపండ్రా! .. రాష్ట్రం విడిపొయాక కూడా, మీ రాజకీయ ఆదిపత్యం కోసం, ఇంకా ప్రజలను విడదీస్తూ మాట్లాడటం క్షమించరాని నేరం. దేవుడు చూస్తూ వూరుకోడు.

రాజకీయంగా బాబు మీద ద్వేషం వున్న వాళ్ళు కేసీఆర్ మాటలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాబు మీద ప్రేమ వున్న వాళ్ళకు మాటల్లేవు.(కొందరు రాజకీయ నాయకుల మాదిరి సిగ్గు వదిలేసి అడ్డంగా సపోర్ట్ చేస్తున్నారనుకొండి.)

బాబు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్యులకు ఎలా స్పందించాలో తెలియడం లేదు. బాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందవలసిన సమయంలో .. ఇలా అడ్డంగా ఇరికించి/ఇరుక్కుపోయి ఇలా కొట్టుకొవడం సరి కాదు.

కేసీఆర్ దొర, మీ కాళ్ళు మొక్కుతాం .. దయచేసి ఇష్యూని ఇంతటితో ముగించు దొర. బాబు కోసం కాకపొయినా, ఆంధ్ర జనాల కోసం బాబు మీద కేసులు ఊపసమహరించుకొండి.

బాబు, నీ కుట్రల గురించి అన్నీ తెలిసి నిన్నే ఎన్నుకున్నారు అంటే నువ్వు ఏమి చేసినా అభివృద్ది కోసమే చేస్తావని ప్రజలకు తెలుసు(పైకి తిట్టినా). కేసీఆర్ తో రాజీకి వచ్చి, బయటపడు బాబు. నీ దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు సారించు బాబు.

Filed Under: Featured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *