ఆరంభ శూరుడు -పవన్‌కల్యాణ్

Pawan-Kalyan

పవన్‌కల్యాణ్ తన పరిధులకు/స్థాయికి మించి ఊహకందని స్థాయిలో భారీగా ప్రారంభిస్తాడు. మరు క్షణమే అయిపోయిందనుకుంటాడు. పవన్‌కల్యాణ్ మాటల వీరుడు. చేతలు మాత్రం శూన్యం. ఆరంభ శూరుడు -పవన్‌కల్యాణ్.

సామాన్య ప్రజల నుంచి వచ్చే, ఈ విమర్శలకు సరైన సమాధానం అటు పవన్‌కల్యాణ్‌, ఇటు పవన్‌కల్యాణ్ అభిమానులు చెప్పలేరు.

పవన్‌కల్యాణ్ సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా రీసెంట్‌గా రిలీజ్ అవ్వడం, సినిమా యూనిట్ సినిమాను హైప్ చెయ్యకపొయినా హైప్ క్రియేట్ అయిన తీరు, హైప్ రీచ్ కాలేక ఫ్యాన్స్ నుంచే సర్దార్ గబ్బర్‌సింగ్ ఎన్నో విమర్శలు ఎదుర్కోంటున్నాడు. హిట్స్/ఫ్లాప్స్ పవన్‌కల్యాణ్ కేర్ చేయడు, పవన్‌ఫ్యాన్స్ అసలు కేర్ చేయం అంటూ వుంటారు.

  • పవన్‌కల్యాణ్ మంచి మనసు వున్న వ్యక్తి.
  • ఎవరికైనా సహయం చేస్తాడు, చెప్పుకోడు.
  • నిజాయితీగా పని చేస్తాడు. విమర్శలకు భయపడకుండా, విమర్శలలో అర్దాలను మాత్రమే చదవగల్గే కెపాసిటీ వున్న వ్యక్తి.

పవన్‌కల్యాణ్ వచ్చి రాజకీయాలను వుద్దరించగలడా?
లేడు

పవన్‌కల్యాణ్ వచ్చి దేశాన్ని బాగుచేసేయాలని ప్రజలు కోరుకుంటున్నారా?
లేదు

పవన్‌కల్యాణ్‌కు రాజకీయాలు అవసరం వుందా?
లేదు

అవసరం = ఇంధనం. తనకు అవసరం లేకపొయినా రాజకీయలకు వచ్చాడు. ఇంధనం లేకపోతే ఏదీ నడవదు. తనకు అవసరం లేని రాజకీయాల్లో తను నెగ్గుకు రావడం కష్టం. పవర్ కోసం కాదు అంటున్నాడు కాబట్టి, కనీసం ప్రతిపక్షంలోనైనా రాజకీయ ప్రత్యర్దులు అవకాశం కలిపిస్తారో లేదో కాలమే సమాధానం చెపుతుంది.

ఒక్కోసారి గీతదాగీత దాటినా, మనసులోని నిజం రాబట్టడానికి చెత్త ప్రశ్నలు సంధించడం మీడియా ట్రిక్. సరైన సమాధానం హుందాగా చెప్పడం పెద్ద మనుషుల బాద్యత. తనను ఇబ్బంది పెట్టే ట్రిక్ ప్రశ్నలు ఇష్టంలేని పవన్‌కల్యాణ్ మీడియాకు దూరంగా వుంటాడు.

మీడియా హుందాగా వుండాలని కోరుకునే పవన్‌కల్యాణ్, హుందాగా అడిగితే ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తాడనటానికి ఈ ఇంటర్వ్యూ మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *