ఆరున్నర అడుగుల అందగాడు వచ్చేస్తున్నాడు

varun

మెగా కుంటుంబం నుంచి రామ్‌చరణ్, అల్లు అర్జున్ & పవన్‌కల్యాణ్ లాంటి కమర్షియల్ హిరోలు, సాయి ధర్మ్ తేజ్ & అల్లు శీరీష్ లాంటి కొత్త హిరోలు వున్నా .. మెగా కుంటుంబం నుంచి రానా, ప్రభాస్ & మహేష్‌బాబు లాంటి పొడుగైన హిరో లేడు అనే లోటు వుంది. ఇప్పుడు ఆరున్నర అడుగుల అందగాడు వరుణ్‌తేజ్‌ ఎంట్రీతో ఆ లోటు తీరిపోతుంది.

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ లియో ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కి జె. మేయర్, కెమెరా: మణికందన్.

ముహూర్తపు దృశ్యానికి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, చిరంజీవి క్లాప్ ఇచ్చారు. కె. రాఘవేంద్రరావు, వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

Filed Under: Mega FamilyFeatured