ఆశ్వీరాదాలు కావాలి

mukunda

మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న & మెగాబ్రదర్ తనయుడు వరుణ్ తేజ హీరోగా వస్తున్న ‘ముకుంద’ సినిమా ఆడియో బుధవారం (03-12-2014) ప్రేక్షకుల కోలాహలం మధ్య విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీత దర్శకుడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. వరుణ్ తేజ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

పాటలన్నీ చాలా అద్భుతంగా వున్నాయి. కుటుంబకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటలు చాలా ఆహ్లాదకరంగా వున్నాయి. ఎక్కడ కూడా సాహిత్యం కోల్పోకుండా,…. సంగీతం, సాహిత్యం సరైన విధంగా.. వినసొంపుగా రూపొందించాడు సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్. ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ చిత్రం తర్వాత మళ్లీ మిక్కీ జె.మేయర్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్ర పాటలు కూడా ఆ సినిమాలకు తగ్గకుండానే వున్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వరుణ్ తేజ్‌కు మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. మహేష్‌బాబు & ప్రభాస్ ల తర్వాత అంత హైట్ వున్న మరో తెలుగుహిరో వరుణ్ తేజ్.

varun tej

Filed Under: Mega FamilyFeatured