సర్దార్ – ఇంకా ఏమి మిగిలివుంది?

saardar

bobby ‏@dirbobby
Truly amazing working with the Power Star…As a fan first and director next….on cloud nine…

‘గోపాల… గోపాల’ చిత్రం తరువాత కొద్ది నెలలుగా మేకప్ వేసుకోని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎట్టకేలకు మళ్ళీ కెమెరా ముందుకొచ్చాడు. తన తాజా చిత్రం ‘సర్దార్’ షూటింగ్‌లో పాల్గొనడం మొదలుపెట్టాడు.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో ట్రెండ్ సెట్టింగ్ మూవీగా పేరొందిన ‘గబ్బర్‌సింగ్’ కి సీక్వెల్ తరహాలో ఉండేలా ఈ కొత్త సినిమాను డిజైన్ చేశారు. కాని ఇటువంటి తరహాలో బొచ్చుడు సినిమాలు వచ్చాయి & మహేష్‌బాబుతో సహా గబ్బర్‌సింగ్ ను కాపీ కొట్టారు. ఇంకా ఏమి మిగిలివుంది? అని అభిమానులు అని అనుకుంటున్నారు.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఆ మధ్య పుణే సమీపంలోని కొండ ప్రాంతాల్లో జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న రెండో షెడ్యూల్‌లో పవన్‌కల్యాణ్ రంగప్రవేశం చేశారు. ‘‘సర్దార్… గబ్బర్‌సింగ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఎప్పటిలానే చాలా డైనమిక్‌గా, డ్యాషింగ్‌గా కనిపిస్తున్నారు’’ అని చిత్ర నిర్మాత శరత్ మరార్ పేర్కొన్నారు. సాధారణంగా సినిమా మొదలైన చాలా రోజుల తరువాత కానీ ఫస్ట్‌లుక్‌లు విడుదల చేయరు. కానీ, ‘సర్దార్’కున్న క్రేజ్ దృష్ట్యానో, మరింత క్రేజ్‌ను తెచ్చేందుకనో కానీ, ఫస్ట్‌లుక్ స్టిల్ ఒకటి శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. శరత్ మరార్ సైతం ఆ మాటే ఒప్పుకుంటూ, ‘‘ఫోటోలను కొంత ఆలస్యంగా రిలీజ్ చేయడం ఆనవాయితీ. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం ఫ్యాన్స్ కోసం వ్యక్తిగతంగా ఈ చిత్రాన్ని షూట్ చేయించి, కంపోజ్ చేశారు’’ అని వివరించారు. పవన్‌కల్యాణ్ కేవలం వెనక నుంచి పోలీస్ డ్రెస్‌లో, తుపాకీతో, గ్యాంగ్‌ను ఎదుర్కొంటున్నట్లు స్టిల్‌లో కనిపించారు. ఆయన ముఖం కూడా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే ఈ స్టిల్ వైరల్‌గా వ్యాపించడం విశేషం.

Filed Under: Pawan KalyanFeaturedసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *