ఇండస్ట్రీ హిట్ రేంజ్

Screen Shot 2015-03-07 at 11.33.14 AM

“జులాయి” “ఇద్దరమ్మాయిలతో” “రేసుగుర్రం” .. ఈ మూడు సినిమా హిట్ రేంజ్‌లు చూస్తే, అల్లు అర్జున్ కమర్షియల్ హిరోగా పది మెట్లు ఒకేసారి ఎక్కాడు. “రేసుగుర్రం” సినిమాకు కావాల్సిన పునాదిని, స్టామినాను, ఎనర్జీని, ఊపును “జులాయి” “ఇద్దరమ్మాయిలతో” సినిమాలు ఇచ్చాయి.

రాజమౌళి ఇంకా ఫార్మ్‌లో వుండటం వలన & మాస్ మెచ్చే డైరక్టర్ కావడం వలన, త్రివిక్రమ్‌ను నెం 1 డైరక్టర్ అని అనలేకపొతున్నాం కాని, డిమాండ్ & రెమ్యునరేషన్ పరంగా చూస్తే త్రివిక్రమ్‌ను నెం 1 అనేయవచ్చు. “జులాయి” .. “అత్తారింటికి దారేది” … సినిమాలతో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, కమర్షియల్ డైరక్టర్‌గా వంద మెట్లు ఎక్కాడు. ఓవర్‌సీస్ , ఫ్యామిలి ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడతారో, ఇప్పుడు మాస్ ప్రేక్షకులు కూడా అంతే ఇష్టపడుతున్నారు.

వీరిద్దరి కాబినేషన్‌లో వస్తున్న S/O సత్యమూర్తి సినిమాపై ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఎక్సపెటేషన్స్ వున్నాయి. ఆ రేంజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ వుంది.

రేసుగుర్రంలో బ్రహ్నానందం ఎపిసోడ్ సినిమా రేంజ్‌ను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్ళిందని “మీకు ఏమీ insecurity feeling లేదా” అని అల్లు అర్జున్‌ను అడిగితే నాతో పాటు సినిమా సూపర్ విజయం ఆయన భుజ స్కంధాలపై వుండటం ఆనందమే అని చెప్పాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు సపోర్ట్‌గా బ్రహ్నానందంతో పాటు ఎంతో మంది నిలబడ్డారు. త్రివిక్రమ్ వీళ్ళందరినీ కరెక్ట్‌గా వాడుకొని వుంటాడని ప్రేక్షకులకు నమ్మకం వుంది. వీళ్ళందరూ సినిమా రేంజ్ పెంచడానికి ఊపయోగపడతారు. అందుకే ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఎక్సపెటేషన్స్ వున్నాయి. ఆ రేంజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ వుంది.

Filed Under: Mega FamilyTeluguసత్యమూర్తి గారి అబ్బాయి