ఇండియా టాప్ 5 లిస్టులో ‘పవన్ కళ్యాణ్’

pawan-kalyan

‘అత్తారింటికి దారేది’ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ‘పవన్ కళ్యాణ్’ అభిమానులకు మరో తీపి కబురు వచ్చింది.

టాలీవుడ్ లో ‘పవన్ కళ్యాణ్’ ఓ సంచలనం..’పవన్ కళ్యాణ్’ చిత్రం వస్తుందంటే అభిమానులకు పండుగే..ఆయనే ఆరాధ్యదైవం అని కొలుస్తుంటారు.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దేశంలోనే ‘మోస్ట్ డిజైరబుల్ యాక్టర్స్’ జాబితాలో పవన్ కళ్యాణ్ ఐదో స్థానంలో నిలిచి తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇటీవల ‘న్యూయార్స్ టైమ్స్ ‘నిర్వహించిన ఆన్ లైన్ లో భారతదేశంలో ’10 మోస్ట్ డిజైరబుల్ యాక్టర్స్’ జాబితాలో పవన్ కు ఐదో స్థానం దక్కగా ఆరోస్థానంలో ప్రిన్స్ మహేష్ కు ఆరోస్థానం దక్కింది.

పవన్ నటించిన ‘అత్తగారింటికి దారేది’ చిత్రంతో ఒక్కసారిగా తారాస్థాయిలోకి దూసుకెళ్లాడు. ‘వంద కోట్లు’ సాధించే సత్తా ఉన్న చిత్రంగా వార్తల్లోకెక్కింది. న్యూయార్క్ టైమ్స్ జాబితాలో మొదటి స్థానం బాలీవుడ్ బాద్ షా ‘షారుఖ్ ఖాన్’ మొదటి స్థానం సంపాదించుకోగా, సల్మాన్ రెండవ స్థానం, అక్షయ్ కుమార్ మూడో స్థానం, హృతిక్ రోషన్ నాలుగో స్థానాలు దక్కించుకున్నారు.

Filed Under: Pawan KalyanFeatured