ఇది నిజం

Kirsh
ఒక సినిమాతో ఒకదానికి సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న క్రిష్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమానే ‘కంచె’. ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ వలన కలెక్షన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. అందరినీ అబ్బురపరిచే వరల్డ్ వార్ II సీన్స్, వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్, సాయి మాధవ్ బుర్రా రాసిన కదిలించే డైలాగ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు 1940 కంటెంట్ ని సూపర్బ్ గా ప్రెజంట్ చేసిన విధానం అందరికీ బాగా నచ్చుతుంది.

“మొదట నేను కంచె స్టొరీని చాలా మంది ప్రముఖులకు చెప్పినప్పుడు ఈ కథ వర్క్ అవుట్ అవ్వదు. దీన్ని సినిమాగా తీస్తే ఎవ్వరూ చూడరు అని అన్నారు. అందుకే నేను సైలెంట్ గా ఈ సినిమాని తీసి రిలీజ్ చేసాను.” అని క్రిష్ అంటున్నాడు. మెగా అభిమానులు కూడా అదే అనుకున్నారు. మాస్ హిరోగా స్టార్ అవ్వవలసిన వరుణ్‌తేజ్, క్రిష్‌తో సినిమానా అని.

సినిమా కథకుడు అందరికంటే ముందుగా ఆ సినిమాను తన ఊహల్లో చూస్తాడు. తన ఊహల్లో చూసిన కథను, వేరే వాళ్ళకు చెప్పేటప్పుడు వివరంగా చెప్పలేకపొవచ్చు. వినే వాళ్ళు వేరే కోణంలో ఊహించుకొవడం వలన, వినే వాళ్ళు చూసే సినిమా వేరుగా వుంటుంది. “కంచె” విషయంలో అదే జరిగింది. ఇదే ప్రొజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ లేదా దిల్ రాజు చేసివుంటే అసలు ఆ హైపే వేరు.

క్రిష్‌కు సపొర్ట్ అందించిన నాగబాబు & వరుణ్‌తేజ్ కూడా అభినందనీయులు. హాట్సఫ్ టు క్రిష్.

Filed Under: Featuredకంచె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *