ఇది నిజమా?

PK

ఒకప్పుడు(ఖుషి తర్వాత) రాంగోపాలవర్మ, కృష్టవంశీ, పూరి జగన్నాధ్ .. ఇలా ఎంతో మంది దర్శకులు పవన్‌కల్యాణ్‌కు కథలు వినిపించారు. కాని, అవన్నీ రిజెక్ట్ చేసి, తనే ఒక లైను చెప్పి, నాతో సినిమా చెయ్యాలనుకుంటే, ఆ లైనుకు స్క్రిప్ట్‌తొ రండి అని వెనక్కి పంపించేసాడు. పవన్‌కల్యాణ్ లైన్ అర్దం చేసుకొనే ప్రయత్నం చేయలేకో, మనం కష్టపడి చేసినా రిజెక్ట్ చేస్తారన్న కాన్ఫిడెన్స్‌తోనో వాళ్ళు తిరిగి వెళ్ళడం జరగలేదు.

ఇప్పుడు డైరక్టర్స్ వెళ్ళడమే మానేసినట్టు వున్నారు. దిల్ రాజుకు చెప్పాడు. దాసరికి చెప్పాడు. వాళ్ళు కూడా చేతులేత్తేసినట్టు వున్నారు.

పవన్ కల్యాణ్ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత తనతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. సినిమాలు చేయడానికి దర్శకులు ఎవరూ రాకపోవడం మూలానే సర్దార్ గబ్బర్ సింగ్‌ కథను తానే రాసుకుని తీయాల్సొచ్చిందని పవన్ చెప్పారు. అంచనాలకు తగ్గ సినిమా తీయలేనేమోనన్న భయంతోనే అత్తారింటికి దారేది తర్వాత ఏ కథను అంగీకరించలేదన్నారు.

పవన్ కల్యాణ్

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *