సుబ్బు – ఇమేజ్ ఛేంజ్ ఓవర్ మూవీ

subbu

పలానా హిరో సినిమా అంటే ఈ సినిమాలో ఈ అంశాలు కచ్చితంగా వుంటాయి. అనుమానం లేకుండా టాక్‌తో సంబంధం లేకుండా ఒకసారి సినిమా చూడోచ్చు అనే నమ్మకం కలుగజేయడం అంత ఈజీ విషయం కాదు. ఆ ఇమేజ్ రావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఫ్యామిలీ హిరో వారసులకు ఆ ఇబ్బంది లేదు. ఫ్యామిలి ఇమేజ్‌తో హిరోగా ఎంట్రీ అవుతారు. వాళ్ళకుండే ఛాలెంజ్ ఏమిటంటే, ఆ ఫ్యామిలి ఇమేజ్ ని పొగొట్టుకోకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొవడం.

“అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” “గోకులంలో సీత” సినిమాలు చూసి పవన్‌కల్యాణ్ హిరోగా కంటీన్యూ అవ్వడం కష్టం అనుకున్నారు, కాని “తొలిప్రేమ” “తమ్ముడు” సినిమాలతో బిగ్ సరప్రైజ్ ఇచ్చి తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

“పిల్లా నువ్వు లేని జీవితం” సినిమా విషయానికి వస్తే సినిమా సక్సస్ అంతా డైరక్టర్ స్క్రీన్‌ప్లే కే ఎక్కువ మార్కులు వచ్చాయి. సినిమా సక్సస్ అవ్వడంతో హిరోకు కుడా బాగానే పేరు వచ్చింది తప్ప, హిరో సినిమాను నిలబెట్టగలడు అనే పేరు మాత్రం రాలేదు. “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమా ఆ ఇమేజ్ ను చేంజ్ చేస్తుందని అంటున్నాడు హిరో సాయి ధర్మ్ తేజ్. ఇది డైరక్టర్ సినిమా అయినా, హిరోకు పేరు వచ్చే విధంగా సినిమా డిజైన్ చేయబడిందని అంటున్నాడు.

Filed Under: Featuredసుబ్రమణ్యం ఫర్ సేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *