ఇలా అయితే ఎలా?

24ntuYMa

మీడియాకు న్యూస్ కావాలి. కావాల్సినంత న్యూస్ రోజూ దొరకడం చాలా కష్టం. రాంగోపాలవర్మ మూడ్ వచ్చినప్పుడు తప్ప, రోజూ ట్వీట్ చెయ్యడు.(ఈ మధ్య ఈయన ప్రతి ట్వీటు ఒక న్యూస్ ఐటమ్ అయిపోయింది). మీడియా వాళ్ళు ఊహించి కథలు అల్లేస్తూ వుంటారు. పవన్‌ఫ్యాన్స్.కామ్ కూడా అలానే చేస్తూ వుంటుంది. ఉదాహరణకు “అ ..ఆ” రిలీజ్ జూలై 15 అనేది ఒక ఊహాగానం. మరీ అంత గ్యాప్ వుంటుందా అనేది కూడా డౌటే కాని, కొద్దిగా వున్న ఛాన్స్‌ను ఎక్కువ చేసి వ్రాస్తే ఎక్కువమందికి చేరుతుందనే భ్రమ. (పోటి పడటం మంచిది కాదు, రెండు సినిమాల కలక్షన్స్‌కు నష్టం అని చెప్పడం అనేది ముఖ్య వుద్దేశం)

శృతి మించి ఒకరికిని కించపరచాలనో వెటకారం చెయ్యాలనో వుద్దేశించే ఊహాగానాలు అయితే తప్పు కాని, ఎదో హైప్ చేద్దామని చేసే ఊహాగానాలను ఖండించకూడదు. రాజమౌళి కొడుకుని హైప్ చేద్దామనే వుద్దేశంతో ఎన్.టి.ఆర్‌తో సినిమా అని ఒక రూమర్ క్రియేట్ చేసి, ABN ఛానల్ వారు జనాల మీదకు వదిలారు. బాగానే వుంది కాని, రాజమౌళి కొడుకు మౌనంగా వుండకుండా ఇలా డైరక్ట్‌గా ఖండించేస్తే ఎలా?

S.S.Karthikeya
‏@ssk1122 S.S.Karthikeya Retweeted ABN Andhrajyothy
Wow! Some rumours get you excited too!S.S.Karthikeya added,

ABN Andhrajyothy @abntelugutv
#SSRajamouli Son #Karthikeya will Direct #JrNTR Soon
https://www.youtube.com/watch?v=jJHG46rTfT0

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *