క్లాస్ ప్రేక్షకులకు ఈ ఒక్క పాట చాలు

Screen Shot 2014-12-03 at 9.19.02 PM

4. పాట : గోపికమ్మ
గాయని : చిత్ర
సాహిత్యం : సిరివెన్నెల
‘ముకుంద’ ఆల్బంకు కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ తీసుకొచ్చింది ఈ ‘గోపికమ్మ…’ సాంగ్. లెజెండ్రీ సింగర్ చిత్ర గారి వాయిస్, ‘గోపికమ్మ చాలునే నీ నిదర..’ అంటూ వచ్చే కోరస్ వాయిస్ పాటలో పండుగ వాతావరణం తీసుకొచ్చాయి. తన అనుభవాన్ని అంతా రంగరించి సిరివెన్నెల రాసిన సాహిత్యం టాప్ క్లాస్ లో ఉంది. సాహిత్యం ఎంత సుస్పష్టంగా వినబడుతుందో.. నేపధ్యంలో తబలా, ఇతర వాయిద్యాల శబ్దం, చిత్ర వాయిస్ కూడా అంతే సుస్పష్టంగా వినబడడం ఈ పాటలో ప్రత్యేకత. మిక్కి ఈ సాంగును అద్బుతంగా కంపోజ్ చేశారు. క్లాస్ ఆల్బంలో సూపర్ హిట్ గా నిలిచింది ఈ పాట.

Source: http://www.123telugu.com/telugu/reviews/music-review-mukunda-classy-album.html

క్లాస్ పాటలు వేరు. మాస్ పాటలు వేరు. మాస్ పాటలు వెంటనే ఆకట్టుకుంటాయి. క్లాస్ పాటలు వెంటనే ఆకట్టుకొవడం అరుదు. అటువంటి అరుదైన క్వాలిటీ కలిగిన పాట ఇది. ఈ పాటకు సంబంధించిన ట్రైలర్ చూస్తుంటే పిక్చరైజేషన్‌తో ఈ పాట మరింత హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్ర గారి వాయిస్ హైలట్ అయ్యి, ఇనిస్టెంట్ హిట్ అవ్వడానికి కారణం అయ్యింది. చిత్రగారిని కూడా ఆడియో ఫంక్షన్‌కు ఆహ్వానించి వుంటే బాగుండేది.(ఇప్పుడు మిస్ అయినా సినిమా పబ్లిసిటిలో భాగంగా సిరివెన్నల గారి సమక్షంలో చిత్రగారికి చిన్న సన్మానం చేస్తే బాగుంటుంది)

మన తెలుగు సినిమాల్లో ప్రేక్షకులు హిరో డామినేషన్ కోరుకుంటారు. ఆ విధంగానే మన డైరక్టర్స్ సినిమాలు తయారు చేస్తారు. హిరోయిన్ పెరఫార్మన్స్‌కు చాలా తక్కువ ఛాన్స్ వుంటుంది. ఆ తక్కువ స్పేస్ లో హిరోయిన్‌కు కూడా మంచి మార్కులు వచ్చేలా, థియేటర్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ హిరోయిన్ గురుంచి మాట్లాడుకోనేలా హిరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసే దర్శకులు చాలా చాలా అరుదు. ఆ అరుదైన దర్శకుల్లో కచ్చితంగా శ్రీకాంత్ అడ్డాల ముందు వుంటాడనటంలో ఎటువంటి సందేహం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా అంజలికి ఎంత మంచి పేరు వచ్చిందో ముకుంద సినిమా ద్వారా పూజా హెగ్డే కు అంతే మంచి పేరు వచ్చేలా వుంది.

Filed Under: Mega FamilyFeatured