ఈ సినిమా కూడా హిట్టే

AS

వారసులు అయినంత మాత్రనా నిల్దొక్కుకొవడం అంత ఈజీ కాదు. పవన్‌కల్యాణ్ కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హిరొల్లో ఎక్కువ విమర్శలు అందుకున్న హిరో సాయిధర్మ్‌తేజ్. అన్ని విమర్శలు వచ్చినా, మొదటిసినిమా “పిల్లా నువ్వు లేని జీవితం” సూపర్‌హిట్ అవ్వడంతో మీడియమ్ రేంజ్ హిరోగా సెటిల్ అయిపొయాడు. ప్రస్తుతం, సాయిధర్మ్‌తేజ్ కంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్న మరో మెగా హిరో అల్లు శిరీష్.

గౌరవం .. కొత్త జంట .. రెండు సినిమాలు చేసాడు. గౌరవం చూసి, నారా రోహిత్ మాదిరి విభిన్నమైన సినిమాలు ప్రయత్నం చేస్తాడనుకుంటే, “కొత్త జంట” తో కమర్షియల్ హిరోగా సర్‌ప్రైజ్ చేసాడు. అనుకున్నంత విజయం సాధించలేదు కదా, అల్లు శిరీష్‌పై విమర్శలు ఏ మాత్రం తగ్గలేదు.

ఇన్ని విమర్శలు ఎదుర్కొంటూ, పట్టు వదలని విక్రమార్కుడులా తన మూడో సినిమా “శ్రీరస్తు శుభమస్తు” ను జనాలపై వదలటానికి రెడీ అయిపొయాడు. ఈ సినిమా కూడా హిట్ గ్యారంటీ అంటున్నాడు అల్లు శిరీష్. కథ-కథనాలు బాగుంటే, ఎన్ని విమర్శలు చేసినా చూస్తారు మన మంచి తెలుగువాళ్ళు.

Allu Sirish ‏@AlluSirish May 9
Jalsa, Ghajini, Magadheera, 100% Love, Kotta Janta, PLNJ, BBM & Sarrainodu. Congrats Dad & Geetha Arts team. It will be +1 soon! 😉

Filed Under: శ్రీరస్తు శుభమస్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *