ఎంత పాపం చేస్తే

rgv

హుదూద్ ప్రళయ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. ఎటుచూసినా విరిగిన చెట్లు.. నేలకొరిన స్తంభాలు.. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడిన తుఫానుతో పౌరజీవనం అస్తవ్యస్థమైంది.

ప్రకృతి విపత్తులు దేవుడు సృష్టించేవే అయితే.. ఇలాంటి విధ్వంసం సృష్టించి దేవుడు ఎలా ఆనందం పొందుతాడని వర్మ ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఉన్న అందరూ పాపం చేసినవాళ్లేనా.. వాళ్లను ఆయన ఎందుకు శిక్షించాలనుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Ram Gopal Varma ✔ @RGVzoomin

If a natural disaster is an act of God what pleasure does God take in such destruction?

I can’t believe that everybody in Vizag is a sinner that he wanted to punish everybody…but ofcourse God knws bettr and I am jst a commoner.

రోజు రోజుకు సాటి మనిషిని ఎదోక సాకుతో అవమానించి తద్వార ఆనందమో ఆదిపత్యమో సాధించాలనుకునే వాళ్ళు మరియు మనసులో రాంగోపాలవర్మ మాదిరి ఆలోచిస్తూ పైకి మాత్రం ప్రపంచంలో తనను మించిన గుడ్ పర్సన్ లేరంటూ మాట్లాడే వాళ్ళు పెరిగిపోతుంటే దేవుడు ఇటువంటి ప్రళయాలు సృష్టిస్తూ మనుషుల మధ్య ఐకమత్యం పెంచి మనషుల ఆలోచన్లను సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ వుంటాడని రాంగోపాలవర్మకు తెలుసు కాని, పైకి మాత్రం ఇటువంటి వ్యాఖ్యలతో మీడియాను వెర్రిపప్పలను చేస్తూ తనవైపు తిప్పుకుంటాడు.

good job CBN.
good job by Mega Heroes.
good job by everyone who responded/helped victims of cyclone.

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు, దర్శకులు తమంతట తాము ముందుకు విరాళాలు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఎవరెవరు ఎంతెంత విరాళాలుగా ఇచ్చారు అనే విశేషాలు ఇక్కడ:

పేరు డొనేట్ చేసిన అమౌంట్
చిరంజీవి 50 లక్షలు
బాలకృష్ణ 30 లక్షలు + 20 టన్నుల రైస్, మెడిసిన్
నాగార్జున 25 లక్షలు
దగ్గుబాటి ఫ్యామిలీ 50 లక్షలు
కృష్ణ 15 లక్షలు
పవన్ కళ్యాణ్ 50 లక్షలు
మహేష్ బాబు 25 లక్షలు
ఎన్.టి.ఆర్ 20 లక్షలు
ప్రభాస్ 20 లక్షలు
రవితేజ 20 లక్షలు
అల్లు అర్జున్ 20 లక్షలు
సూర్య 25 లక్షలు
రామ్ చరణ్ 15 లక్షలు
విశాల్ 15 లక్షలు
కార్తీ 12.5 లక్షలు
జ్ఞానవేల్ రాజ 12.5 లక్షలు
విజయ నిర్మల 10 లక్షలు
నితిన్ 10 లక్షలు
త్రివిక్రమ్ 10 లక్షలు
సమంత 10 లక్షలు
వివి వినాయక్ 10 లక్షలు
కళ్యాణ్ రామ్ 10 లక్షలు
బోయపాటి శ్రీను 7 లక్షలు
అల్లరి నరేష్ 5 లక్షలు
ప్రకాష్ రాజ్ 5 లక్షలు
గోపీచంద్ 5 లక్షలు
శ్రీను వైట్ల 5 లక్షలు
కాజల్ అగర్వాల్ 5 లక్షలు
సునీల్ 5 లక్షలు
స్మిత 5 లక్షలు
బ్రహ్మానందం 3 లక్షలు
నిఖిల్ సిద్దార్థ్ 3 లక్షలు
సందీప్ కిషన్ 2.5 లక్షలు
ఆకాష్ పూరి 2 లక్షలు
చిన్ని కృష్ణ 1.5 లక్షలు
సంపూర్నేష్ బాబు 1 లక్ష
రకుల్ ప్రీత్ సింగ్ 1 లక్ష
రాశి ఖన్నా 1 లక్ష
నందు 1 లక్ష
ప్రతాప్ కలగొట్ల(నిర్మాత) 1 లక్ష
నవీన్ చంద్ర 1 లక్ష
రాహుల్ రవీంద్రన్ 1 లక్ష
సాయి కొర్రపాటి 50 వేల బస్తాల బియ్యం (100టన్నులు)

 

WE ARE ONE.

Filed Under: Extended Family