ఎలా స్పందించాలి?

pawan-kalyan-chandrababu-naidu

పార్టీ వ్యవస్థాపకుడు అన్నగారినే పార్టీ నుంచి గెట్టివేసి, ఎన్నో అవమానాలకు గురిచేసి, చివరి రోజిల్లో ఎంతో మనస్థాపానికి కారణమై, ప్రజల ఆదరణతో ఎటువంటి సిగ్గు లేకుండా ముందుకు సాగుతున్న పార్టీ తెలుగుదేశం. డబ్బులు దోచుకొవడం .. డబ్బులు పంచిపెట్టడం .. కుళ్ళు రాజకీయాలు .. కుట్రలు చెయ్యడం .. వెన్నతో పెట్టిన విద్య తెలుగుదేశం పార్టీకి.

అయినా కాని తెలుగుదేశం గెలవడానికి కారణం:

  1. చంద్రబాబు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో చేస్తాడనే ఆశ
  2. జగన్ వస్తే రౌడియిజం పెరుగుపోతుందనే భయం

ప్రజలకు అన్నీ తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సాహయులు. రాజకీయ నాయకులు వాళ్ళను కలుషితం చేసేసారు. ఎవరో ఒకరి సైడు చేరి, వారు ఏమి చేసినా ఒప్పే అని అడ్డగోలుగా వాదించడం తప్ప ఏమీ చెయ్యలేరు.

వీడియో టేప్లు , ఆడియో టేప్లు రిలీజ్ చేసి టి.ఆర్.యస్ పార్టీ ఏమి ప్రూవ్ చేయదల్చుకుంది?

ఈ వివాదం నుంచి బయటకు రావడానికి, పార్టీల మధ్య జరుగుతున్న వైరాన్ని ప్రాంతల మధ్య వైరంగా మార్చే దిశలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించడం ఇంకో దారుణం.

రాజకీయల్లో పైచేయి సాధించడానికి ఏమీ చేసినా తప్పు కాదనే తెలుగుదేశం పార్టీ సిద్దాంతాన్ని బాగా చదివినట్టు వున్నాడు కెసీఆర్. తెలుగుదేశం పార్టీ పరువు తీయడానికి ఏమీ చెయ్యడానికైనా వెనుకాడటం లేదు. ఎంత చేసినా వీళ్ళు దొరకనంత వరకే.

Support CBN:
అందరూ దొంగలే అన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబుని తిడుతూ చంద్రబాబుకి సపోర్ట్ ఏమిటని కన్‌ఫ్యూజన్ వద్దు. మెగా అభిమానిగా చిరంజీవిపై చంద్రబాబు చేసిన కుట్రలకు ప్రతీకారానికి ఇది సమయం కాదు.

రాజధాని నిర్మాణానికి స్థిరమైన ప్రభుత్వం అవసరం. ప్రపంచం మనవైపు చూసే విధంగా రాజధాని నిర్మించగల సత్తా ఒక్క చంద్రబాబుకే వుంది.

కులపిచ్చి అనేది ఒక భ్రమ. రాజకీయల్లో కులం కార్డు కీలకమైన అంశం. దానిని తెలివిగా వాడుకోవాల్సిన బాద్యత రాజకీయ నాయకులపై వుంది. కేవలం ఒక కులం సపొర్ట్ మీద గెలుస్తారనుకొవడం భ్రమ.

సమర్దులు ఏదైనా సాధిస్తారు. సమర్ధులను సపొర్ట్ చెయ్యవలసిన బాద్యత అందరిపై వుంది.

రేవంత్ రెడ్డి ఇష్యూని, తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చెయ్యడానికి టి.ఆర్.యస్ చేస్తున్న ఒక ఎత్తుగడగానే భావించాలి.

వ్యక్తిని బలి చెయ్యడం దారుణం:
రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారి అనే విషయం అందరికీ తెలిసిందే. వ్యక్తిని బలి చెయ్యడం దారుణం. చర్యలు తెలుగుదేశం పార్టీపై తీసుకొవాలి. అందరూ దొంగలై వుండి, జగన్ ఒక్కడినే విచారణ చెయ్యడం ఎంత దారుణమో .. రేవంత్‌రెడ్డి ఒక్కడినే బలి చెయ్యడం అంతే దారుణం.

bottom line:

  1. కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు.
  2. అందరూ దొంగలే.
  3. ప్రస్తుతం మనకు రాజధాని అవసరం.
  4. సత్తా ఒక్క చంద్రబాబుకే వుంది.
  5. Support CBN unconditionally.

Filed Under: Featured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *