ఎవడే సుబ్రమణ్యం

2014-09-06_792_Home_nani

యంగ్ ఎన్.టి.ఆర్ “టెంపర్” వరల్డ్ వైడ్ షేర్ 50 కోట్లు దాకా వుందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. టెంపర్ లాంటి ఒక సినిమాకు కలక్షన్స్ కొలబద్ద కాకూడదు. ఒక మంచి పాయింట్‌ను తీసుకొని, ఆ పాయింట్ ఎలా చెపితే ప్రేక్షకులకు బాగా చేరుతుందో ఆ రీతిలో చెప్పడం జరిగింది. ఎన్.టి.ఆర్ పెరఫార్మన్స్‌తో సినిమాకు మరింత ప్రాణం పోసాడు. ఒక మెసేజ్ సినిమాకు 50 కోట్లు షేర్ సూపర్ అని. కాకపొతే సినిమాకు వచ్చిన టాక్ + ఎన్.టి.ఆర్ రేంజ్‌కు ఆ కలక్షన్స్ తక్కువ అని విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి పెద్ద హిరోలపై ఎంత ఒత్తిడి వుంటుందో అర్దం అవుతుంది. ప్రతి సినిమాకు కలక్షన్సే కొలబద్దగా చూసేవాళ్ళకు పెద్ద హిరోలు ఎక్సపెరమెంట్స్ చెయ్యడంలో లేదని విమర్శ చేసే అర్హత లేదు.

చిన్న హిరోలకు, అప్ కమింగ్ హిరోలకు ఆ ఒత్తిడి లేదు. ఎన్ని ఎక్సపెరమెంట్స్ చేస్తే అంత మంచి పేరు వస్తుంది. తనకొచ్చిన అవకాశాన్ని “ఎవడే సుబ్రమణ్యం” తో హిరో నాని చూపించపొతున్నాడు. ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా క్లాస్ నచ్చే సినిమా అవుతుందని ఫీల్ వస్తుంది.

Filed Under: Extended FamilyFeatured