ఎవరు ఎక్కువ అలరిస్తారు?

mahesh-ramcharan

ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సంక్రాంతి, స‌మ్మ‌ర్ & ద‌స‌రా.. మూడు మంచి సీజ‌న్స్. మిగతా రెండు సీజన్స్‌లో ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం అరుదు కాని, సంక్రాంతి సీజన్‌లో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు సినిమాలు రిలీజ్ అవుతూ వుంటాయి. ఆ విధంగా:

డైరెక్టర్ సుకుమార్ , ప్రిన్స్ మ‌హేష్ బాబు తో చెక్కిన ‘1’ చిత్రం సంక్రాంతి బ‌రిలో చాలాఅంచ‌నాల‌తో వ‌స్తుంది. ఈ సినిమా ట్రైల‌ర్స్, సాంగ్స్ అంచ‌నాన్ని ఆకాశాన్ని తాకించాయి. ఎప్పుడో విడుద‌ల కావాల‌సిన ఎవ‌డు చిత్రం కూడా పండుగ‌ను న‌మ్ముకునే వ‌స్తుంది.

ఇప్పుడు అందరి ముందు ఒకే ప్రశ్న:

ఎవరు ఎక్కువ అలరిస్తారు?

ప్రేక్షకుల కోణంలో చూస్తే రామ్‌చరణ్ ‘ఎవడు’ కంటే మహేష్‌బాబు ‘1’ పైనే ఎక్కువ అంచనాలు వున్నాయి. మహేష్‌బాబు ‘1’ క్లాస్‌కే పరిమితం అవుతుందనే భయం వుంటే, రామ్‌చరణ్ ఎవడు లో కీలకమైన ట్వీస్ట్లు క్లిక్ అవుతాయో లేదో అనే భయం వుంది.

సుకుమార్ నిర్మాతలను కేవలం ఖర్చు పెట్టడానికే పరిమితం చేసి, మహేష్‌బాబు ఇచ్చిన ప్రొత్సాహంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సరికొత్త కథా-కథనాలతో సరికొత్త మహేష్‌బాబును మనకు చూపించ బోతున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే మహేష్‌బాబును సరికొత్తగా చూపించి ప్రేక్షకులను మెప్పించాలనే లక్ష్యంతో తీసిన సినిమా ‘1’.

పైడిపల్లి వంశీ ‘ఎవడూ సినిమా మాత్రం ప్రతి సీను నిర్మాత దిల్ రాజు పూర్తి అంగీకారంతోనే తీసాడు. మాస్ ప్రేక్షకులను అలరించడానికి చాలా కాంప్రమైజ్ ఆయ్యి వుంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే సరికొత్త కథతో రామ్‌చరణ్‌కు మరో కమర్షియల్ విజయం అందించాలనే లక్ష్యంతో తీసిన సినిమా ఎవడు.

రెండు సినిమాలకు కామాన్ పాయింట్ ఏమిటంటే ‘రివెంజ్’ తో సాగే కథలే.

Filed Under: Mega FamilyFeatured