ఏప్రిల్ 17 రిజర్వ్ చేసుకున్న ‘దోచేయ్’

Dochey

శ్రీనువైట్ల డైరక్షన్‌లో వస్తున్న రామ్‌చరణ్ సినిమా మొదలవ్వక ముందే అక్టోబర్ 15 రిలీజ్ అని ఆ డేట్‌ను రిజర్వ్ చేసేసుకున్నారు. తెలుగు సినిమాల సంఖ్య అనూహ్య రీతిలో పెరిగి పొవడం వలన పెద్ద హిరోలకు కూడా డేట్స్ దొరకని పరిస్థితి నెలకొని వుంది. ఇక చిన్న సినిమాల సంగతి గురుంచి చెప్పుకునేది ఏముంది. మిగిలిన డేట్స్ ఎడ్జస్ట్ చేసుకొవాల్సిందే.

నాగచైతన్య హీరోగా కృతి సనన్‌ హీరోయిన్‌గా “స్వామి రా రా” ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘దోచేయ్‌’. రిలయన్స్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. పతాకంలో బి.వి.ఎ్‌స.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 17న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారని సమాచారం.

Filed Under: Extended FamilyTelugu