ఏప్రిల్ 8 ని పవన్‌కల్యాణ్ కబ్జా

AA

స్థలాలు కబ్జా విన్నాం. ఇప్పుడు కొత్తగా టాలీవుడ్లో రిలీజ్ డేట్స్ కబ్జా జరుగుతుంది.

అల్లు అర్జున్ హీరోగా, బాలయ్యకు రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా నందమూరి అభిమానుల నుంచి మంచి గౌరవాన్ని పొందుతున్న భోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న సినిమా ‘సరైనోడు’. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండటంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. షూటింగ్ మొదలుపెట్టినప్పుడే బన్నీ పుట్టినరోజు ఏప్రిల్ 7 సందర్భంగా ఆ వీకెండ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకొని, దానికనుగుణంగా పని చేసారు. ప్రీలుక్, టీజర్ .. ఇలా ఒక దాని తర్వాత మంచి హైప్ క్రియేట్ చేసారు. ఏప్రిల్ 8 ని పవన్‌కల్యాణ్ టీం కబ్జా చేసేసి “సర్దార్ గబ్బర్్‌సింగ్” ఏప్రిల్ 8 అని ఎనౌన్స్ చేసారు. ఈ సినిమా కాస్తా నెలాఖరుకు పోస్ట్‌పోన్ చేసుకొవాల్సి వచ్చింది.

సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఇక ఈ మధ్యే ఒక పాట కోసం బొలీవియా వెళ్ళిన టీమ్, నిన్నటితో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌లపై ‘తెలుసా తెలుసా’ అనే ఓ పాటను బొలీవియాలోని పలు అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఇక సరైనోడు బొలీవియా పూర్తైందని తెలియజేస్తూ టీమ్ విడుదల చేసిన ఫోటోలో బన్నీ జాతీయ జెండాను పట్టుకొని నిలబడ్డం బాగా ఆకర్షిస్తోంది.

సంవత్సరానికి 365 రోజులు . అందులో ఒక రోజే నా సినిమా రిలీజ్ అని ఇండైరక్ట్‌గా పోటికి రావద్దు అని పవన్‌కల్యాణ్ చెప్పడం ఆసక్తికరం. దాసరి ఎల్లప్పుడూ టార్గెట్ చేసే ఆ నలుగురిలో ఒకడైన అల్లు అరవింద్ ్‌కు చెక్ పెట్టడం ఒక్క పవన్‌కల్యాణ్‌కే సాధ్యం. దాసరి పండగ చేసుకుంటాడెమో.

Filed Under: FeaturedJust4Funసరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *