ఏమని ప్రశ్నించాలి?

rgv

పాలకుల్ని ప్రశ్నిస్తాననే వాడు ప్రశ్నించనప్పుడు, కళ్యాణం కోరుకునే జనాలకి ప్పెళ్ళెప్పుడు?

ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రొహమ్..ఇది కళ్యాణ ద్రోహం.

–RGV

ఎన్నికల్లో జనాలకు డబ్బులు పంచి పెడుతున్నారానేది నిజం. అందరికీ తెలుసు.

అధికార ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను భయపెట్టో, ఆశ పెట్టో లొంగదీసుకుంటుదనేది నిజం. అందరికీ తెలుసు.

టి.ఆర్.యస్ అయినా .. తెలుగుదేశం అయినా .. డబ్బులతో లొంగే నాయాకులను లొంగదీసుకుంటుందనేది నిజం. అందరికీ తెలుసు.

ఇవన్నీ తెలియకుండానే పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సపోర్ట్ చేసాడా? కాదే .. అన్నీ తెలిసే చేసాడు. ప్రజలకు తెలిసే తెలుగుదేశానికి ఓట్లు వేసారు. చంద్రబాబు బెటర్ అని ఇటు కల్యాణ్ కాని, ప్రజలు కాని నమ్మారు.

అత్యుత్సాహం ప్రదర్శించి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపొయాడు. ఇలా డబ్బులిచ్చి లొంగదీసుకొవడం కొత్త ఏమి కాదు. టి.ఆర్.యస్ ఏమి తక్కువ కాదు కాదు.

ఏమని ప్రశ్నించాలి?

ఎందుకు డబ్బులు ఇస్తున్నావు ? అని అంటే, అంతకు మించి ఆత్మ వంచన ఇంకోటి వుండదు.

ఎందుకు అలా దొరికిపొయవు? అయినా అంత పెద్ద నాయకుడవై అయివుండి, డైరక్ట్‌గా నువ్వే వెళ్ళటం ఏమిటి? అని ప్రశ్నించాలి.

bottomline:
రాంగోపాలవర్మకు ఏదో కెలకాలని ట్విట్ చేసాడు. సైటులో ఎదో న్యూస్ పెట్టాలని వ్రాయడమే తప్ప, ప్రశ్నించడానికి ఏమీ లేదని అందరికీ తెలుసు..

జగన్ ఫ్యాన్స్ ప్రశ్నించాలి. మా నాయకుడికి విమర్శించే అర్హత తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళకు లేదని.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *