ఒకే ఒక్కడు రాజమౌళి

rm

“యమదొంగ” సినిమాతో తన రూటు మార్చుకునే ప్రయత్నం చేసాడు. ఆ సినిమా నిర్మాత దగ్గరనుండి సహకారం అందకపొవడంతో అల్లు అరవింద్ సహకారం తీసుకున్నాడని మరియు దానికి ప్రతిఫలంగా అల్లు అరవవింద్‌కు “మగధీర” చేసాడని టాక్. యమదొంగ ఏ లక్ష్యంతో స్టార్ట్ చేసాడో, ఆ లక్ష్యాన్ని మగధీరతో సాధించాడు. కాని

  1. “మగధీర” ఫైనల్ కాపీలో శ్రీహరి రోల్ సీన్స్ విషయంలో మెగాస్టార్ మాట వినక తప్ప లేదు.
  2. అల్లు అరవింద్ కూడా రాజమౌళిని డైరక్షన్ వరకే పరిమితం చేసి, పబ్లిసిటీ భారం అంతా తనే చూసుకున్నాడు.

ఈ రెండు అంశాలు రాజమౌళికి రుచించినట్టు లేవు. అప్పటి వరకు మాస్ డైరక్టర్ గానే పరిమితం అయినా రాజమౌళి, అన్నీ వర్గాల ప్రేక్షకులకు దగ్గరకు చేసి లైఫ్ టర్నింగ్ ఇచ్చిన “మగధీర” సినిమా అని చెప్పుకొవడానికి అంత ఇష్టపడడు. అంతా తానై తప్పైనా ఒప్పైనా పొగడ్తలైనా విమర్శలైనా తనకే రావాలి అనుకునే టైపు. నిర్మాత కేవలం పెట్టుబడి పెట్టి, తనకు కావల్సినవి అందించి, ప్రొఫిట్ షేర్(తన సినిమా లాస్ వుండదు) చేసుకొనే వాడై వుండాలి అనుకునే టైపు రాజమౌళి. మగధీర తర్వాత వచ్చిన “మర్యాద రామన్న” “ఈగ” .. ఇప్పుడు “బాహుబలి” .. ఒకే ఒక్కడు రాజమౌళి నడిపించేసాడు.

ఏది అడిగితే అది కాదనకుండా సమకూర్చే నిర్మాతలు. ఫ్యామిలీ సపోర్ట్. ఒక రోజు కాల్షీట్స్ అడిగితే మూడు రోజులు కాల్షీట్స్ నటీ నటులు. 24X7 తనతో పాటు కలిసి పనిచేసే టెక్నికల్ టీమ్. ఇవన్నీ సంపాదించుకొవడం అంత ఈజీ కాదు.

bottom line:
ఇది రాజమౌళి “బాహుబలి”. థియేటర్లోనే చూడవలసిన సినిమా.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *