ఒక మనసు – పెద్ద సాహసమే

Niharika Konidela on her debut Oka Manasu

రామ్‌చరణ్ పూరి జగన్నాధ్ సినిమా ద్వారా పరిచయం కావడం, ఆ సినిమా ద్వారా రామ్‌చరణ్ స్క్రీన్ మీద ఎలా వుంటాడు? వాయిస్ ఎలా వుంటుంది? రామ్‌చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకొవడానికి స్క్రీన్ మీద ఏమి చేయగలడు? అనే విషయాలు పరఫెక్ట్‌గా చూపించాడు పూరి జగన్నాధ్. రామ్‌చరణ్ కూడా చాలా కంఫర్ట్‌బుల్‌గా చేసాడు. సినిమా కమర్షియల్‌గా కూడా బాగా చేసింది. పూరి జగన్నాధ్ 100/100 సంపాదించుకున్నాడు. ఒక స్టార్ హిరో వారసుడిని , దర్శకుడిగా ఏ ఒత్తిడి లేకుండా పూరి జగన్నాధ్ డీల్ చేసాడు.

రామ్‌చరణ్ మొదటిసినిమా చెయ్యడానికి ఎంతో మంది దర్శకులు ముందుకు వచ్చినా, పూరి జగన్నాధ్ చేతుల్లో పెట్టడం అనేది ఒక గొప్ప నిర్ణయం.

నాగ చైతన్యను కూడా పూరి జగన్నాధ్ చేతుల్లో పెడదాం అనుకున్న నాగ్ నిర్ణయానికి పూరి జగన్నాధ్ హ్యాండ్ ఇవ్వడంతో, దిల్ రాజు చేతుల్లో పెట్టాడు. నాగబాబు వరుణ్‌తేజ్‌ను అశ్వినీదత్ ద్వారా పరిచయం చెయ్యాలనుకున్నాడు కాని, చివరికి అడ్డాల్ శ్రీకాంత్ చేతుల్లో పెట్టాడు. అలానే అఖిల్ వి.వి.వినాయక్ సినిమా ద్వారా పైచయం అయ్యాడు. ఈ నిర్ణయాలు తప్పు అనలేము కాని, సినిమాలు ఫెయిల్ అయ్యేటప్పటికి విమర్శించే వాళ్ళు తప్పుడు నిర్ణయాలుగా విమర్శిస్తూ వుంటారు.

ఇప్పుడు మెగా డాటర్ “నిహారిక” వంతు వచ్చింది. నిహారిక సిల్వర్ స్క్రీన్ మీద ఎలాఉంటుందోనన్న ఆసక్తి మెగా ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానుల్లోనూ రోజురోజుకీ పెరుగుతోంది. టాలీవుడ్ లో గుడ్ లుకింగ్ హీరోగా పేరుపడ్డ నాగశౌర్య నిహారిక పక్కన కరెక్ట్‌గా సరిపొయాడు.

మంచి స్క్రిప్ట్, మంచి లవ్ స్టొరీ, మంచి సినిమా .. అని ప్రచారం చేయబడుతున్న ఈ సినిమా పాటలు క్లాస్ ప్రేక్షకులను, యూత్‌ను బాగా అకట్టుకున్నాయి. కమ్ర్షియల్‌గా ఎంత సక్సస్ సాధిస్తుంది? అనే ప్రశ్నతో పాటు, ఈ సినిమా స్క్రిప్ట్ గొప్పతనం ఏమిటో తెలుసుకొవాలనే ఆత్రుత కూడా ప్రేక్షకుల్లో వుంది.

ఇటువంటి సినిమాలు స్లోగా హిట్ అవుతాయి. పాటలు హిట్ అవ్వడానికి కూడా చాలా సమయం పట్టింది. అన్ని రోజులు థియేటర్లో వుండగలదా అనేది పెద్ద ప్రశ్న.

bottomline:
కమర్షియల్ సక్సస్ ముఖ్యం అని భావించే రోజుల్లో, “ఒక మనసు” – పెద్ద సాహసమే.

Filed Under: Featuredఒక మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *