‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ రామ్ చరణ్ ప్రోమో

Screenshot from 2014-10-25 09:37:22

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొని మనసు విప్పి మాట్లాడారు. ఈ ఎపిసోడ్ ఆదివారం రాత్రి ప్రసారం కాబోతోంది. తాజాగా విడుదలైన ఈ ఇంటర్వ్యూ ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రోమోనే ఇంత ఆసక్తిగా ఉందంటే…మొత్తం ఇంటర్వ్యూలో రామ్ చరణ్ నుండి ఆర్కే ఎలాంటి జవాబులు రాబట్టాడో రేపు తేలనుంది. ఈ ప్రోమోలో కొన్ని ప్రశ్నకుల రామ్ చరణ్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

రాజకీయాల్లోకి రావాలనే నాన్నగారి నిర్ణయాన్ని తాను ఇప్పటికీ అభినందిస్తున్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. రాజకీయాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు వచ్చాయనే ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానం ఇస్తూ…తమ కుటుంబ సంబంధాలను రాజకీయాలతో ముడి పెట్టి ఎప్పుడూ చూడలేదు. మాదంతా ఒకటే రక్తం. ఎవరెన్ని ప్రచారాలు చేసినా కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపదు అని తెలిపారు.

తొలి సినిమా చిరుత విజయం సాధించడం చాలా ఆనందం కలిగించిందని తెలిపారు. తొలి సినిమా చిరుతలో నటించని హీరోయిన్ నేహా శర్మతో తన వివాహం జరుగుతోందనే వార్తలు విని షాకయ్యానని, అప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నేను అలాంటి వార్తలు అసలు ఊహించలేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

ఉపాసనతో తనకు పెళ్లికి ముందు ఏడేళ్ల స్నేహ బంధం ఉందని, ఆమెకు తొలుత నేనే ప్రపోజ్ చేసానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన వివరాుల నవంబర్లో వెల్లడిస్తామన్నారు.

Filed Under: Mega Family