ఓవర్సీస్ రియల్ హిరో – నాని

Share the joy
  •  
  •  
  •  
  •  

KGVP

నాని కెరీర్‌లో సరికొత్త కథాంశంతో కృష్ణగాడి వీర ప్రేమ గాథ తెరకెక్కింది. భలే భలే మగాడివోయ్ హిట్ సినిమాకు తర్వాత.. కథను ఎంచుకోవటంలో నాని సఫలమయ్యాడు. మిక్సిడ్ టాక్ వచ్చినా, నానిని మాత్రం అందరూ పొగుడుతున్నారు.

“ఒక సినిమా ఎంతమంది చూసారు ? సినిమా చూసిన వాళ్ళల్లో ఎంతమందికి నచ్చింది?” .. ఈ రెండు ప్రశ్నలకు వచ్చే సమాధానాలే, సినిమా నిజమైన సక్సస్‌కు నిర్వచనాలు. $30, $25, $20 .. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టిక్కెట్టు రేటు పెట్టేసుకొని, అభిమానుల వీక్‌నెస్ దోచేసుకొని, మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసిందని గొప్పలు చెప్పేసుకుంటూన్న ఈ రోజుల్లో, “ఓవర్సీస్ రియల్ హిరో – నాని” అని అంటున్నారు. $12 టిక్కెట్టు ధరతో $475K వీకెండ్ కలక్షన్స్ సాధించిన నానికి అభినందనలు.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *