కంచె

On-Location-Varun-Tej-on-Krish-movie-sets-1

వరుణ్‌తేజ్ మొదటి సినిమాపై భారీ ఎక్సపెటేషన్స్ క్యాష్ చేసుకొవడంలో మెగా ఫ్యామిలి ఫెయిల్ అయ్యింది. రెండో సినిమా కూడా అదే తరహా సినిమా ఎంచుకొని అందరినీ ఆశ్చర్య పరిచాడు.

రామ్‌చరణ్ మాస్‌లో దూసుకుపొతూ క్లాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో వున్నాడు. బన్నీ ప్లానింగ్ & ట్రెండ్ సెట్టింగ్‌లో రామ్‌చరణ్ కంటే ముందున్నాడు. సాయి ధర్మ్ తేజ్ మొదటిసినిమాతోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు.

వరుణ్‌తేజ్ ఎంచుకున్న క్లాస్ మార్గంలో మొదటి సినిమా ఫెయిల్ అయినా రెండో సినిమాతో పుంజుకుంటాడెమో చూడాలి.

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాల ఫేం క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి నిర్మాత.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కోసం రామానాయుడు స్టూడియోలో భారీ సెట్ వేసారు. ఈ సెట్లో సినిమాకు సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేస్తారట. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాలో కూడా హీరోయిన్.

Filed Under: Mega FamilyFeaturedTeluguకంచె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *