పవన్‌కల్యాణ్ స్పందించాలి

Pawan-Kalyan-pelted-with-stone-584x360

భీమవరంలో పవన్ అబిమానుల అరెస్టు

తప్పు ఇరువైపులా పెట్టుకొని పవన్ అభిమానులను మాత్రమే అరెస్ట్ చెయ్యడం చూస్తుంటే:

“బలవంతులదే రాజ్యం”, “డబ్బున్నవాళ్ళదే రాజ్యం” “అధికారం వున్న వాళ్ళదే రాజ్యం” అనిపిస్తుంది.

“ఆస్తులపై దాడులు చెయ్యడం” ముమ్మాటికీ తప్పే. కాని ఆ దాడులకు కారణం ఏమిటో విచారించకుండా తప్పు అని అనటం కూడా తప్పే. రెచ్చగొట్టడం అనే చర్యకు ప్రతి చర్య దాడులు. ” రెచ్చగొట్టడం” అనే చర్యను పక్కన పెట్టి, దాడులు చేసారని అరెస్ట్ చెయ్యడం దారుణం. తప్పు ఇరువైపులా పెట్టుకొని బలహీనుల ప్రతిచర్యలకు శిక్ష వెయ్యడం దారుణం.

పవన్‌కల్యాణ్ స్పందించాలి:

  1. పవన్ అభిమానులు క్షణికావేశంలో చేసిన చర్యలకు ప్రభుత్వం క్షమించాలని అభ్యర్దించాలి.
  2. తమ ఆనందం కోసం కాకుండా పక్క వాళ్ళను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దని ఇరు వర్గాలకు విజ్ఞ్జప్తి చెయ్యాలి.

ఈ విషయంలో ఎక్కడ కుల ముద్ర పడుతుందోనని పవన్ మౌనంగా వుండి వచ్చు. ఇది కుల కోణం పక్కన పెట్టి, బలవంతులు బలహీనుల సమస్యగా చూడాలి. బలహీనులకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా వుండటంలో అర్దం లేదు.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *