కాంప్రమైజ్ అవ్వలేదంటున్న మహేష్‌బాబు

Share the joy
  •  
  •  
  •  
  •  

MB

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు కనెక్ట్ అవ్వడం చాలా మంది ప్రేక్షకులకు కష్టమైన విషయం. కారణం తను చూసిన నిజ జీవితంలో ఎలా జరుగుతుందో అలాంటి సీన్స్ క్రియేట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి సిట్యువేషన్స్ చూడని/వినని ప్రేక్షకులకు బోర్‌గా అనిపిస్తుంది. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అన్నదమ్ముల అనుబంధాన్ని చాలా సహజంగా చూపించాడు. కొందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మరో కొత్త సింపుల్ కాన్సప్ట్ “అందరూ కలిసుందాం” తో మహేష్‌బాబును ఒప్పించగల్గాడు. మాస్ ఎలిమెంట్స్ కలిపి ఆ కాన్సప్ట్‌ను కంపు చేయకుండా, అలానే తీసినట్టు వున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.

టార్గెట్ చేసిన క్లాస్ ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు & లేడీస్ కు ఎక్కితే, మహెష్‌బాబుకు శ్రీమంతుడు తర్వాత మరో సూపర్‌డూపర్ హిట్ సినిమా అయ్యే ఛాన్సస్ వున్నాయి. ప్రిరిలీజ్ ప్రమోషన్స్ కూడా సినిమా మూడ్‌నే కంటీన్యూ చేస్తున్నారు. ఫాల్స్ పబ్లిసిటీ ఏమీ లేదు.

Filed Under: Featuredబ్రహ్మోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *