కాంబినేషన్ ఖరీదు 30 కోట్లు

pktrivikram1_1

తెలుగుసినిమా ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ వున్న ఒకే ఒక్క దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కారణం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తే ఆ హిరోకు వచ్చే ఇమేజే వేరు.

జులాయికు ముందు అల్లు అర్జున్ ఇమేజ్ వేరు. తర్వాత వేరు. ఓవర్ యాక్షన్ ఎలా కంట్రోల్డ్‌గా చెయ్యాలో అల్లు అర్జున్‌కు తెలిసింది.

అతడుకు ముందు మహేష్‌బాబు వేరు. తర్వాత వేరు. ఖలేజ కూడా సరికొత్త మహేష్‌బాబు ను అవిష్కరించింది.

జల్సా సినిమా పవన్‌కల్యాణ్ కొన్ని షరతులు విధించడం వలన మాక్సిమమ్ అవుట్‌పుట్ ఇవ్వలేకపొయాడు, కాని అత్తారింటి దారేది విషయంలో త్రివిక్రమ్ నమ్మకానికి పవన్‌కల్యాణ్ దగ్గర నుండి పూర్తి మద్దతు లభించడంతో దాని అవుట్‌పుట్ అందరికీ తెలిసిందే.

పవన్‌కల్యాణ్ మహేష్‌బాబులతో త్రివిక్రమ్ సినిమా అంటే వాళ్ళతో సమానంగా రెమ్యూనరేషన్ త్రివిక్రమ్్‌కు ఇవ్వల్సిందే. దాని ఖరీదు అక్షరాల 30 కోట్లు అంట.

ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకుడు ఒక్క త్రివిక్రమ్ మాత్రమే కాదు కాని, త్రివిక్రమ్ కు వున్న నాలెడ్జ్ వలన ఈయన ఒక్కడికే ఇంత హై డిమాండ్.

1) రాజమౌళి కూడా ఎక్కువ డిమాండ్ వున్న దర్శకుల్లో ఒకడు. 100% కమర్షియల్ విజయం కన్‌ఫార్మడ్ . మగధీర తర్వాత రెమ్యూనరేషన్‌తో పాటు హిరోను డామినేట్ చెయ్యాలనే అలోచనతో వుండటం వలన పెద్ద హిరోలు ఈయన దగ్గరకు రావడం లేదు. ఈయన పెద్ద హిరోలు నా దగ్గరికి వస్తేనే చేస్తా అన్న రీతిలో వుండటంతో డిమాండ్ తగ్గింది (త్రివిక్రమ్ తో పోల్చుకుంటే).

2) వి.వి.వినాయక్ –> ఒకప్పుడు రాజమౌళీతో సమానంగా డిమాండ్ వున్న దర్శకుడు. ప్రస్తుతం అనూహ్య రీతిలో వెనుకబడిపొయాడు. రెమ్యూనరేషనే కారణం అనుకుంట. కొత్తదనానికి భయపడటం వి.వి.వినాయక్ వీక్‌నెస్.

దూకుడుతో శ్రీనువైట్ల, గబ్బర్‌సింగ్‌తో హరీష్‌శంకర్, రేసుగుర్రంతో సురేందర్‌రెడ్డి లకు కూడా మంచి డిమాండ్ వచ్చింది.

వీళ్ళందరిది ఒక ఎత్తైతే పూరి జగన్నాధ్‌ది మరో ఎత్తు. తొక్కలో సినిమా కోసం అంత కాలం వెచ్చించాల అని, అతి తక్కువ కాలంలో మినిమమ్ బడ్జెట్‌తో సినిమా చుట్టేసి ఆ దర్శకులకు ధీటుగా రెమ్యూనరేషన్ తీసుకొవడం పూరి జగన్నాధ్ ప్రత్యేకత.

bottomline:
హిరోకు ఎంత పెద్ద ఇమేజ్ వున్నా, ఆ ఇమేజ్‌ను కరెక్ట్‌గా వాడుకుంటూ , ఆ ఇమేజ్‌కు తగ్గ సినిమా చెయ్యడం అంత సులువైన పని కాదని రెమ్యూనరేషన్‌తోనే మరీ అంతలా సినిమా బడ్జెట్ పెంచేస్తే చివరికి అవకాశాల కోసం కొత్త దర్శకుల మాదిరి వీళ్ళూ కూడా ఎదురుచూపులు చూడాల్సిందే.

Filed Under: Pawan Kalyan