కామెంట్స్

comments

ఫ్యాన్స్ సైటు ఇలానే వుండాలని రూల్ ఏమీ లేదు. పవన్‌ఫ్యాన్స్.కామ్ ఆఫీషియల్ ఫ్యాన్స్ సైటు కూడా కాదు ఇది. ఎప్పుడో ఆవేశంతో స్టార్ట్ చేసి కంటీన్యూ చేయవలసి వస్తుంది. ఈ సైటుకు వచ్చే పవన్‌ఫ్యాన్స్ గుర్తు పెట్టుకొవాల్సిన మొదటి విషయం “వేరే హిరోలను కించపరిచే వుద్దేశం అసలు లేదు”. “రెండో విషయం మెగా హిరోలను పవన్‌కల్యాణ్ ఫ్యామిలీగా, మిగతా హిరోలను extended ఫ్యామిలిగా ట్రీట్ చెయ్యడం జరుగుతుంది”.

వెర్రి వెయ్యి రకాలు. మా పద్దతి ఇదోక రకమైన వెర్రి అని గమనించగలరు. మాకు పవన్‌కల్యాణ్‌తో గాని, పవన్‌కల్యాణ్ ఆఫీషియల్ ఫ్యాన్స్ అసోషియన్స్‌తో గాని ప్రస్తుతం ఎటువంటి లింక్స్ లేవు. అక్కడా ఇక్కడా అభిప్రాయాలను సైటు మెయింటేన్ చేసే ఒకరిద్దరి అభిప్రాయలను జోడించి ప్రచురించడం జరుగుతుంది.

విజిటర్స్ అభిప్రాయలను పరిగణలోకి తీసుకొవాలనే వుద్దేశంతో కామెంట్స్ పొస్ట్ చేసే అవకాశాన్ని ఓపెన్ చేసాం. కామెంట్స్ డీసెంట్‌గా చెయ్యాలని విజ్ఞప్తి. ఈ సైటుకు వస్తున్నారంటే, మీరు కచ్చితంగా పవన్‌కల్యాణ్‌ను అభిమానించే వాళ్ళే అయ్యివుంటారు. మాకు తెలిసిన, మేము నమ్మిన నిజాన్ని నిర్భయంగానో, వెటకారంగానో, వంకరగానో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అర్టికల్స్ కొద్దిగా వంకరగా వున్నాయని నోరు జారొద్దు. ఎవరినీ కించపరచాలనే వుద్దేశం అవసరం మాకు లేవు.

మాతో మీరు అంగీకరించాలని రూల్ లేదు. మేము వ్యక్తపరచాలనుకున్న విషయాలు, కొన్నిసార్లు సరిగ్గా చేయలేకపొవచ్చు. టైం వెచ్చించి డీసెంట్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్న వాళ్లకు థాంక్స్. రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.

మరొక్కసారి చెపుతున్నాం: ఎవరినీ కించపరచాలనే వుద్దేశం అవసరం మాకు లేవు. ఈసైటు అడ్డుపెట్టుకొని వ్యక్తిగత లాభాలు గడించాలన్న ఆలోచన అసలు లేదు. ఈ సైటు వలన పవన్‌కల్యాణ్‌కు డ్యామేజ్ జరుగుతుంది అనుకున్న రోజు, ఈ సైటు క్లోజ్ చేయబడుతుంది.