కిక్ 2 ఆడియో రివ్యూ

kick 2

ఇప్పుడు అల్లరి నరేష్ పరిస్థితి ఎలా వుందో, కిక్-1 సినిమాకు ముందు రవితేజ పరిస్థితి అలానే వుండేది. జనాలు రొటీన్ రొటీన్ అని మాత్రమే కాదు గ్యాప్ లేకుండా సినిమాలు మీద సినిమాలతో విసిగించేసాడు. ఆ సినిమా కంటెంట్ రేంజ్‌కు తగ్గ రేంజ్ హిట్(కలక్షన్స్ పరంగా) కాకపొయినా, కిక్ సినిమా రవితేజకు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకొవచ్చు. కిక్ సినిమా తర్వాత రవితేజ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసాడు. బలుపు పవర్ అలా చేసినవే. కాని తన రేంజ్ పెంచుకోలేకపొయాడు. కిక్-1, బలుపు & పవర్ సినిమాలు జనాలు బాగా ఎంజాయ్ చేసారు & హిట్ అనిపించుకున్నాయి కాని, రవితేజ రేంజ్ పెంచలేకపొయాయి.

సురేందర్ రెడ్డికి కిక్ సినిమాతో మంచి పేరు వచ్చింది. కంటెంట్ రేంజ్‌కు తగ్గ రేంజ్ హిట్(కలక్షన్స్ పరంగా) అవ్వలేదని బాగా ఫీల్ అయ్యాడు.కిక్ పెద్ద కమర్షియల్ హిట్(తను ఊహించినంత) అవ్వలేదనే బాద, రేసుగుర్రం సినిమాతో బన్నీ రేంజ్ అమాంతంగా పెంచేసి ఆ బాద తీర్చేసుకున్నాడు.

ఇప్పుడు సురేందర్ రెడ్డి కిక్ 2 సినిమాను రేసుగుర్రం రేంజ్‌లో పెద్ద హిట్ అయ్యేలా ప్లాన్ చేసాడు. తమన్ అవే డప్పులు, సింగర్ వాయిస్‌లో జీర .. తమన్ పాత పాటలు గుర్తుకు వచ్చినా, “పండగ చేస్కో” కంటే బాగున్నాయి అనిపిస్తాయి, ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడే కిక్ 2 మూడు సాంగ్స్ నచ్చుతాయి.

మమ్మీ మమ్మీ: ఇనిస్టెంట్ హిట్
నువ్వే నువ్వే: ఎవరేజ్. ఎదో రెహమాన్ సాంగ్ గుర్తుకు వస్తుంది.
జెండాపై కపిరాజు: హైలట్ ఎమోషనల్ సాంగ్. ఇనిస్టెంట్ హిట్
మస్తానీ మస్తానీ: ఎవరేజ్
టెంపుల్ సాంగ్: ఎమోషనల్ సాంగ్. బాగుంది. ఎదో రెహమాన్ సాంగ్ గుర్తుకు వస్తుంది.
కుక్కురుకురు కుక్కురుకురు కిక్: ఇనిస్టెంట్ హిట్. సల్మాన్‌ఖాన్ కిక్ లో ఒక పాటని అటూ ఇటూ మార్చి కొట్టినట్టు వున్నాడు.

Filed Under: Featuredకిక్-2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *