కుమారి 21F ఎంకరేజ్ చెయ్యాలా? వద్దా?

21 F

సుకుమార్ అంటే అందరికీ గుర్తు వచ్చే సినిమా ఆర్య. ఒన్ సైడ్ లవర్స్ కు ఇష్టమైన సినిమా. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని కూడా అనవచ్చు. కథలు ఇలా కూడా అల్లవచ్చా అనే విధంగా కథ-కథనాలు వుంటాయి. సుకుమార్ డైరక్షన్ చెయ్యకపొయినా, ఆయన కలం నుంచి వెలువడిన మరో సినిమా కుమారి 21F. ఈ సినిమా ట్రైలర్ చూసాక, ఈ సినిమాను ఎంకరేజ్ చెయ్యాలా? వద్దా? అనే సంధిగ్దంలో పడేసింది.

ఒపెన్ సీక్రెట్స్ బట్ట బయలు చేయకూడదు. చేసినా చాలా అసహ్యంగా వుంటుంది. ఫిలిం మేకర్స్ ఆ సీక్రెట్స్ పెట్టడానికే చూస్తూ వుంటారు. అందులో భాగంగా పుట్టినవే డబుల్ మీనింగ్ డైలాగ్స్. ఇంకొందరు ఫిలిం మేకర్స్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి, పచ్చిగా నిజాలు చెప్పేస్తు వుంటారు. కుమారి 21F సినిమా ట్రైలర్ చూసినప్పుడు అటువంటి ఫీలింగే కలిగింది. యూత్‌ను చెడగొట్టడానికి వస్తున్న మరో సినిమా అయ్యేట్టు వుందని, ఎంకరేజ్ చెయ్యాలా? వద్దా? సినీ విమర్శకులు సంకోచిస్తున్నారు. ఇంత పచ్చిగా చెప్పటం సుకుమార్‌కు కొత్త కాదు. ఆర్య-2 ‘రింగ రింగ’ పాట లిరిక్స్‌కు ఎన్నో విమర్శలు వచ్చాయి.

పాటలు ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందటంతో పాటు, యూత్‌ను రెచ్చగొట్టి ఆకట్టుకునే సినిమా అనే టాక్ రావడంతో ఈ సినిమాపై అందరి కళ్ళు పడ్డాయి. సుకుమార్ యూత్‌ను రెచ్చగొట్టి నాలుగు పైసలు వెనకేసుకునే రకం కాదని, మనసుకు హత్తుకునే ఫీల్ ఈ సినిమాలో వుంటుందని ఆశించే సినిమా ప్రేక్షకులు లేకపొలేదు. Two Days To Go.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *