కుమారి 21F – Exclusive Review

Kumari-21F

సినిమా చూడచ్చా? లేదా?
యూత్ తప్పక చూడవలసిన సినిమా.

సుకుమార్ డబ్బులు కోసం దిగజారి తీసిన సినిమానా?
100% No.

సెక్స్ ప్రధానంగా జరిగే కథను ఎంచుకోవడం కచ్చితంగా సాహసమే. అనామకుడు ఆ పని చేస్తే డబ్బులు కోసం చేసాడని అనుకోవచ్చు. క్రియేటివ్ డైరక్టర్‌గా పేరుండి, సెక్స్ ప్రధానంగా జరిగే కథను ఎంచుకోవడం వలన వచ్చే విమర్శలకు భయపడకపొవడానికి కారణం, తన సినిమా సమాజాన్ని తప్పు ద్రొవ పట్టించాలనే వుద్దేశం ఏ మాత్రం లేదు. ఈ కథను ఎంచుకొవడానికి కారణం యూత్ అందరిలో వుండే అనుమానమే. ఆ అనుమానాన్ని ఎలా డీల్ చెయ్యాలనే దానికి కరెక్ట్‌గా సమాధానం చెప్పాడు.

మెచ్యురిటీకి దిక్కుమాలిన నిర్వచనం ఇచ్చాడా?
దిక్కుమాలిన నిర్వచనం అనే అస్కారం వుంది. అందుకనే డబ్బులు కోసం దిగజారి తీసిన సినిమా కాదు.

డబ్బులు కోసం దిగజారితే, ఫ్యామిలీ ఆడియన్స్ దూరం చేసుకునే విధంగా తీయవలసిన అవసరం లేదు. రెండు మూడు ఇంటెన్స్ సీన్స్ పెట్టి(like రాజమౌళి విక్రమార్కుడు), మిగతా సినిమా అంతా నడిపించవచ్చు. అలా చేయలేదు. మొదటి నుంచి చివరి దాకా యూత్‌కు చెప్పాలనుకున్న పాయింట్ కన్విన్స్ చెయ్యడానికే ప్రయత్నం చేసాడు. పాజిటివ్‌గా ఆలోచించే వాళ్ళకు కనెక్ట్ అయ్యే విధంగా తీసాడు.

ఏమి చెప్పాలనుకున్నాడు?
‘నేనెలాగైనా తిరగచ్చు కానీ, నేను జీవితం పంచుకొనేవాళ్ళు ఎన్నడూ, ఎవరితో తిరగని వాళ్ళయ్యుండాలి’ అని అనుకొవద్దు. నమ్మకమే నిజం. నమ్మకాన్ని మోసం చేయవద్దు.

సెక్స్ మీదే సినిమా అంతా నడవటం కరెక్టేనా?
యూత్ ఆలోచనలు అలానే వుంటాయి కాబట్టి, కరెక్టే అని సమర్దించుకొవచ్చు. అందరికీ తెలుసున్న విషయాలే, మరీ ఇంత పచ్చిగా చెప్పాలా అని కుడా విమర్శించవచ్చు.

ఇంతకీ, మెచ్యూరిటీ అంటే ఏమిటి?
అది చెప్పటం కష్టం. కాని, 1 సినిమా కమర్షియల్ అపజయం, ఆ సినిమాపై వచ్చిన విమర్శలను సుకుమార్ గ్రహించాడని చెప్పవచ్చు. చెప్పాలనుకున్న పాయింట్‌ను చాలా వివరంగా కన్‌ఫ్యూజన్ లేకుండా చెప్పాడు. ఈ సినిమాతో సుకుమార్ మరికొంతమంది అభిమానులను చేర్చుకుంటాడు.

సినిమా సెక్స్ మీద నడుస్తుంది. దిక్కుమాలిన మెచ్యూరిటీ అని అనుకుంటే ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న పాయింట్‌కు అసలు కనెక్ట్ కాలేరు.

bottomline:
“మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు.” అని తెలిసి కూడా సుకుమార్ చేసిన ఈ సాహసానికి హాట్సాఫ్. సపోర్ట్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ & రత్నవేలు అభినందనీయులు.

Filed Under: FeaturedHari Reviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *