కేవలం కాపుల సమస్య అనుకుంటే పొరబాటు

Pawan-Kalyan

ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహరదీక్ష, కేవలం కాపుల సమస్య మాత్రమే అనుకుంటే పొరబాటు. మొన్న ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో తప్పుడు హమీలు, సాధ్యంకాని వాగ్దానాలు చేసాడు.

ప్రతిపక్ష పార్టీ ఏ అంశాన్ని లేవనెత్తినా, ప్రభుత్వం పట్టించుకోలేదు సరికదా, చరిత్రలో ఇంతకు ముందు మీ నాన్న ఇలా చేసాడు. ఇన్ని కేసుల్లో A-1 ముద్దాయిగా వున్న నువ్వు, నీ పార్టీ అడగటానికి అనర్హులు అని చెప్పిందే చెప్పి, అన్నీ అంశాల్లో నెగ్గుకు వచ్చేస్తున్నారు.

ఎవరి ఆలోచనో కాని, వైయస్సార్‌సిపి నాయకులు ముద్రగడను తెరపైకి తెచ్చారు. ఫండింగ్ చేసారు. నిజంగా ఒక పధకం ప్రకారం జరిగింది. చంద్రబాబు పసిగట్టలేకపొయాడు లేదా ఇంత తీవ్రత వుండదెమోనని లైట్ తీసుకున్నాడు.

వైయస్సార్‌సిపి నాయకులు వెనుక వుండటంతో, ప్రభుత్వం ముద్రగడను నానా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసి మరో పెద్ద తప్పు చేసింది. పది వేల మంది వస్తే గొప్ప అనుకున్న మీటింగ్‌కు పది లక్షలు మంది వచ్చారు.

ఆ మీటింగ్‌లో ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందో అనే భయంతో, ముద్రగడ స్పీచ్ తొందరగా ముగించి, “రాస్తారొకో రైలురోకో” లకు పిలుపునిచ్చాడు. (అల్లరి మూకలు రైలు తగల బెట్టేస్తాయి అని అసలు ఊహించలేదు ఆయన). అల్లరి మూకలు రైలును తగల బేట్టేసాయి. అల్లరి మూకలు చేసిన పనిని జగన్‌పై నెట్టేసే ప్రయత్నం చేసారు తప్ప, తాము చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యడం లేదు ప్రభుత్వం.

bottomline:
రాజకీయ పార్టీలు, ఎన్నికల “హామీలు ..” “వాగ్దానాలు ..” ఇచ్చే ముందు ఆలోచించాలి. మాది బి.సి ల పార్టీ, యస్.సి ల పార్టీ .. ఇలా కులాలను విడదీసి గొప్పలు చెప్పుకొవడం మానాలి.

పవన్‌కల్యాణ్ గుడ్డిగా చంద్రబాబు పోటుగాడని ఎలా నమ్మాడో, పవన్‌కల్యాణ్ తో పాటు మెజారిటీ ప్రజలు కూడా నమ్మారు. సమస్యను సామరస్యంగా ముగించవలసిన బాద్యత చంద్రబాబు ప్రభుత్వంపై వుంది.

ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి సబబుగానే వుంది:

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *