కేసీఆర్ బాష రేవంత్‌రెడ్డికి కూడా వచ్చు

Screen Shot 2015-07-02 at 8.10.44 PM

“నా సంక నాకే ఆంధ్రవాళ్ళు ఎవరైనా సేఫ్. నన్ను విమర్శిస్తే, తెలంగాణ వాడైనా అంతు చూస్తా.” ఇది కేసీఆర్ తీరు.

ముఖ్యమంత్రి అంటే శత్రువు కూడా ఎంతో గౌరవించే విధంగా ప్రవర్తించాలి. కాని ఇంత పబ్లిక్‌గా సన్నాసి, లోఫర్, త్రాగుబోతు & బద్మాష్ అని అనిపించుకొవడం మానవ జాతికే ఆవమానం. రేవంత్ వాడిన బాషను ఎవరూ తప్పు పట్టలేరు. కారణం కేసీఆర్ అలానే మాట్లాడతాడు. కేసీఆర్ బాష రేవంత్‌రెడ్డికి కూడా వచ్చు కాని, ఇన్నాళ్ళు సంస్కారంతో వాడలేదు.

రెండు రాష్ట్రాలు ఇప్పుడు. అభివృద్ది వైపు దృష్టి సారిస్తే ప్రజలు ఎందుకు ఆదరించరు? విడిపొయాక కూడా, ఇంకా ఎన్ని రోజులు ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారు?

ఒకే దేశం. దేశంలో జీవించే హక్కు అందరికీ వుంది. ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రాంతం పేరు వాడితే కఠినమైన శిక్షలు పడే చట్టం మన తెలుగు రాష్ట్రాల్లో రావాలి.

ఇది నిజం: రేవంత్ రెడ్డి తప్పు చెయ్యలేదు. రాజకీయ పార్టీలు ఓట్లకు డబ్బులు ఇవ్వడం అనేది, ఓటర్లు తీసుకొవడం పచ్చి నిజం. అది అందరికీ తెలుసు. తెలుగు దేశం పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఓటు కోసం, ఒక ఎం.ఎల్.ఎ కు డబ్బులు ఇచ్చాడు. అధికార పార్టీ తన అధికారాన్ని ఊపయోగించి రేవంత్‌రెడ్డిని కెమెరాల్లొ బంధించి, డైరక్ట్‌గా అధికార పార్టీకి చెందిన మీడియాలో ప్రసారం చేసేసింది. రేవంత్‌రెడ్డి కేవలం పాత్రధారి. డబ్బులు ఇవ్వడం, డబ్బులు తీసుకొవడం అందరికీ తెలిసిన నిజం అయినా, ఇలా డైరక్ట్‌గా రేవంత్‌రెడ్డి లాంటి పెద్ద నాయకుడు ఇవ్వడం అనేది అమాయకత్వం & అతను చేసిన పొరబాటు. శిక్ష పడితే తెలుగుదేశం పార్టీకి పడాలి.

Filed Under: Pawan Kalyanలోఫర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *