‘కొత్త జంట’ షూటింగ్ మొదలు

chiru

అల్లు శిరీష్, రెజీనా జంటగా “ఈ రోజుల్లో” “బస్‌స్టాప్” చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘కొత్త జంట’. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగాస్టార్, కేంద్రమంత్రి చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిరీష్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మూవీ మొగల్, ప్రముఖ నిర్మాత డి రామానాయుడు కెమెరా స్విచాన్ చేసారు.

ఈ కార్యక్రమానికి ఇంకా అల్లు అర్జున్, నాగబాబు, సాయి ధరమ్ తేజ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, నిర్మాతలు కెఎస్ రామారావు, దిల్ రాజు, బండ్ల గణేష్, బన్నీ వాసు తదితరులు హాజరయ్యారు.

Filed Under: Mega FamilyFeatured